Begin typing your search above and press return to search.
దొంగతనం కేసులో టాలీవుడ్ హీరో అరెస్ట్
By: Tupaki Desk | 15 Aug 2018 6:24 AM GMTసినిమా అంటేనే రంగుల ప్రపంచం.. ఇక్కడికి తమ కలలు సాకారం చేసుకునేందుకు చాలా మంది ఆరాటపడుతుంటారు. కానీ అందరికీ సాధ్యం కాదు.. ఎంతో కష్టపడి సినిమాలు తీసిన వారు కూడా అవి ఆడక నిండా మునుగుతారు.. ఇలానే హైదరాబాద్ కు చెందిన ఈ యువకుడు హీరో కావాలని కలలుగన్నాడు. అందుకోసం ఆస్తులమ్మి - భారీగా డబ్బు కూడబెట్టి ఓ సినిమా తీశాడు. కానీ అది ఆడలేదు. దీంతో అప్పులపాలయ్యాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. సినిమాలతో తనకు పరిచయమైన సినీ అసిస్టెంట్ ఈ హీరోకు జత కలిశాడు. అతడికి తీవ్రంగా అప్పులున్నాయి. దీంతో ఇద్దరూ కలిసి స్కెచ్ గీశారు. దొంగతనాలు చేశారు. అప్పులు తీర్చారు.. జల్సాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు దొరికిపోయి ఇప్పుడు కటకటాల పాలయ్యారు.
కుషాయిగూడ జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన మహేష్.. విక్కీరాజ్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. మహేష్ కు సినిమాలంటే పిచ్చి కావడంతో సొంత డబ్బుతో ‘నివురు’ అనే సినిమా తీశాడు. అది బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అప్పుల పాలయ్యాడు. విక్కీరాజ్ కు అప్పులు బాగా ఉన్నాయి. దీంతో విక్కీ సులువుగా డబ్బు సంపాదించేందుకు తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు చేసేవాడు. ఆ దొంగ సొమ్మును హీరో మహేష్ డబ్బుగా మార్చేవాడు. వీరిద్దరూ ఇలానే అప్పులు తీర్చి జల్సాలకు అలవాటు పడ్డారు.
హబ్సిగూడ ప్రాంతంలో దొంగతానికి రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చింది. విక్కి, మహేష్ లను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఈ దొంగతనాల డొంక కదిలింది. వీరి నుంచి 15 లక్షల విలువైన 50 తులాల బంగారం - 30 తులాల వెండి - రూ3వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. విక్కీ 2016 నుంచి దొంగతనాలు చేస్తూ జైలుకు వెళ్లొచ్చినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. జైలునుంచి బయటకు వచ్చి మహేష్ తో కలిసి తాజా ఇలా చోరీలకు పాల్పడుతూ దొరికిపోయాడు.