Begin typing your search above and press return to search.
ఆ నలుగురు మధ్య నలిగిపోతున్న స్టార్ హీరో
By: Tupaki Desk | 3 Aug 2017 7:13 AM GMTహిట్ మీద హిట్ ఆ హీరోని స్టార్ రేంజ్ కి తీసుకెళ్లిపోయాయి. గత నాలుగేళ్లుగా ఆ హీరోగారి గ్రాఫ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఎవరి సపోర్ట్ లేకుండా స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిపోయిన ఆ హీరోగారికి ఇప్పుడు సినిమా కష్టాలు మొదలైయ్యాయి. ఎందుకంటే కొందరు స్టార్ నిర్మాతలతో సినిమాలు చేయాల్సిందిగా ఆ హీరో పై ఒత్తిడి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. పోనీ ఆ ఒత్తిడికి తలోగ్గి ఎవరైనా స్టార్ ప్రొడ్యూసర్ తో సినిమా కమిట్ అయితే వరుసపెట్టి ఆ పెద్ద నిర్మాణ సంస్థలోనే సినిమాలు సైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆ హీరోగారి సన్నిహితులు చెబుతున్నారు. ఇది పెద్దగా రుచించని ఆ హీరోగారు ఏం చేయాలో తెలియని ఆయోమయ స్థితిలో ఉన్నాడని తెలిసింది.
ఇప్పటికే రెండు సినిమాలు ఒకే బ్యానర్ లో కమిటైన ఆ హీరో ఆ సంస్థ నుంచి బయటకి వచ్చేలోపే మరో పెద్ద బ్యానర్ లో సినిమా కమిట్ కావాలని ఒత్తిడి మొదలైనట్లు సమాచారం. దీంతో ఆ నలుగురు పెద్ద నిర్మాతల దగ్గరే ఆ హీరోగారి డేట్లు ఫిక్స్ అయిపోతున్నాయి. అలానే ఆ నలుగురు నిర్మాతలు ఒక్కటిగా చేరి, ఆ హీరోగారి డేట్లే కాకుండా, ఇండస్ట్రీలో ఉన్న మీడియం రేంజ్ హీరోల కాల్షీట్స్ కూడా ముందుగానే లాక్ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో సక్సెస్ రానంత వరకు హీరోల్ని పట్టించుకోని ఆ పెద్ద నిర్మాణ సంస్థలు ఒక్కసారి సక్సెస్ వచ్చాక ఆ హీరోల్ని వదలకుండా సినిమాలు చేయడం ఇండస్ట్రీలో ఉన్న మీడియం రేంజ్ నిర్మాతలకి పెద్దగా మింగుడపడటం లేదని ఫిల్మ్ నగర్ లో సీరియస్స్ డిష్కషన్స్ నడుస్తున్నాయి. మరి హిట్ ట్రాక్ ఉన్న హీరోల్ని ఎత్తుకెళ్లిపోతున్న ఆ పెద్ద నిర్మాతలకి రానున్న రోజుల్లో ఎవరైన చెక్ పెడతారేమో చూడాలి.