Begin typing your search above and press return to search.
హ్యాట్రిక్ హీరో నోరు జారుతున్నాడట
By: Tupaki Desk | 10 Jan 2016 3:30 PM GMTసినీ ఇండస్ట్రీలో స్థాయిని పెంచుకోవడం కంటే.. దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమైన విషయం. ఈ విషయం ఓ కొత్త హీరోకి ఇంకా అర్ధం కానట్టు ఇండస్ట్రీ చెప్పుకుంటున్నారు. హ్యాట్రిక్ హిట్స్ కొట్టడంతో అప్పుడే ఎవరిపై పడితే వారిపై నోరు జారేస్తున్నాడట.
రెండు నెలల క్రితం వచ్చిన ఈ కుర్ర హీరో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. నిర్మాతలతో పాటు అందరికీ భారీ లాభాలను కూడా తెచ్చిపెట్టిందీ సినిమా. అయితే.. ఈ మూవీ షూటింగ్ సమయంలో నిర్మాతలకు, ఈ హీరోకు తేడాలొచ్చాయట. తనకు చెప్పిన కథ వేరు, తీస్తోంది వేరు అని బాగానే గొడవ చేశాడట. అయితే.. హీరోకి ఇంపార్టెన్స్ కంటే స్టోరీ పరంగానే ముందుకెళ్లిన యూనిట్.. సూపర్ హిట్ సాధించింది. ఆ సమయంలో ప్రమోషన్స్ లో కూడా ఈ హ్యాట్రిక్ కుర్రాడికి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడానికి కూడా.. ఇదే కారణమని టాక్.
ప్రస్తుతం అదే నిర్మాతలు మరో కొత్త కాన్సెప్ట్ తో సినిమా చేసేందుకు నిర్ణయించుకున్నా.. ఇతగాడిని మాత్రం హీరోగా తీసుకోకూడదని డిసైడ్ అయ్యారట. స్టోరీని నమ్ముకుని ముందుకెళ్లే ఆ యూనిట్.. కొత్త హీరో అయినా పర్లేదన్నట్లుగా ఉన్నారు. ఒకవేళ హిట్ ఇచ్చిన హీరోతో డీలింగ్స్ బాగుండి ఉంటే.. ఈ ఆఫర్ కూడా అతనికే వచ్చేదని, రెమ్యునరేసన్ కూడా భారీగా పెరిగేదని అంటున్నారు.
అయినా సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్ వచ్చినపుడు ఎంత ఒదిగి ఉంటారో.. హిట్ వచ్చినపుడు అంతకంటే తగ్గాలనే విషయం అర్ధం కాకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఒక్క ఫ్లాప్ వస్తే.. స్టార్స్ కూడా తడుముకుంటున్న రోజులివి. ఆ విషయం గ్రహిస్తేనే.. కుర్రాడి కెరీర్ కరెక్ట్ దారిలో ఉండి.. స్టార్ రేంజ్ కి చేరుకుంటారు. లేకపోతే.. బ్యాడ్ టైం స్టార్ట్ అవడానికి ఇదే ప్రారంభం అయిపోతుంది.