Begin typing your search above and press return to search.

సడన్‌ గా ఈ బాబు ఎందుకు విలనయ్యాడు?

By:  Tupaki Desk   |   9 May 2016 7:30 PM GMT
సడన్‌ గా ఈ బాబు ఎందుకు విలనయ్యాడు?
X
ఇప్పటివరకు మన 'బాబు' సదరు క్యాంపుకు ఫ్రెండే. కాని సడన్‌ గా వాళ్లందరికీ విలన్‌ అయిపోయాడు. అందరూ పక్కనెట్టేశారు. ఒక జంట తప్పిస్తే.. ఈ బాబును పెద్దగా ఎంకరేజ్‌ చేయడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు.

మ్యాటర్‌ ఏంటంటే.. మన 'బాబు' ఒక చిన్న హీరో. కొత్తగా ఏ హీరో వచ్చినా కూడా మాంచి ఫ్రెండ్‌ షిప్‌ చేస్తుంటాడు. అయితే సడన్‌ గా ఈ గ్యాంగ్‌ నుండి ఒకమ్మాయి స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఆ తరువాత చాలామంది కుర్ర హీరోలూ హీరోయిన్లు ఇతగాడి క్లబ్‌ లో చేరారు. కాని తిమింగళాలు ఎంట్రీ ఇచ్చాక.. కాలువ చేపలు తట్టుకుంటాయి అన్నట్లు.. ఓ ఇద్దరు బడా హీరోలు కూడా గ్యాంగ్‌ లో చేరారు. మొత్తం ఈక్వేషన్లన్నీమారిపోయాయ్‌. దానితో అసలు గ్యాంగ్‌ స్టార్ట్‌ చేసిన 'బాబు'ను బయటకు తోసేశారు. వాళ్ళందరూ ఒక్కటే. అయితే ఆ గ్యాంగ్‌ నుండి ఓ ఇద్దరు అమ్మాయిలు మాత్రం మనోడితో ఇంకా ఫ్రెండ్‌ షిప్‌ అలాగే మెయిన్టయిన్‌ చేస్తున్నారు. కాని సడన్‌ గా ఈ 'బాబు' వారికి విలన్‌ ఎందుకయ్యాడబ్బా?

పోతే ఈ గ్యాంగ్ అంతా కలసి.. ఆ మధ్యన ఏదో క్లబ్‌ అంటూ కలసి డిన్నర్లు.. కలసి లంచ్‌ లు.. అబ్బో.. ఒక ఊపు ఊపేశారులే. కాని సడన్‌ గా మనోడ్ని మాత్రం పక్కనెట్టేశారు. వై మా? వాట్‌ హ్యాపెండ్‌?