Begin typing your search above and press return to search.
యువ హీరో సొంత సినిమా జాప్యానికి అసలు కారణం అదేనా..?
By: Tupaki Desk | 8 Dec 2021 4:30 PM GMTచాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ యువ హీరో ఒకరు.. ఫలితంతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం అర డజను చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
కరోనా నేపథ్యంలో ఇన్నాళ్లుగా బ్యాకింగ్ లో ఉన్న యువ హీరో సినిమాలన్నీ ఒక్కటొక్కటిగా రిలీజులకి రెడీ అయిపోతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ఓ చిత్రాన్ని విడుదల చేయడమే కాకుండా.. మరో సినిమాని రిలీజ్ కు రెడీ చేశారు.
పెద్ద నిర్మాణ సంస్థల్లో చేస్తున్న సినిమాలు బయటకు వస్తుండటం యువ కథానాయకుడి కెరీర్ కు బాగానే ఉంది కానీ.. ఓన్ ప్రొడక్షన్ లో తయారవుతున్న సినిమా మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు.
తొలి ప్రయత్నంలో నిర్మాతగా సక్సెస్ అయిన హీరో.. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో హోమ్ ప్రొడక్షన్ లో తనే హీరోగా ఓ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.
ఇప్పటికే రెండు సినిమాలు చేసిన యువ దర్శకుడికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. దీని కోసం మంచి టెక్నిషియన్స్ ను పాపులర్ నటీనటులను ఎంపిక చేసుకున్నారు. ఇదొక రొమాంటిక్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలిపారు.
యంగ్ హీరో గత సినిమాల్లో పోషించిన పాత్రలకు భిన్నంగా.. ఇందులో పూర్తి వినోదభరితమైన పాత్రలో కనిపిస్తాడని వెల్లడించారు. అయితే అప్పుడెప్పుడో షూటింగ్ ప్రారంభించబడిన ఈ సినిమా.. ఇప్పటి వరకు కంప్లీట్ అవ్వలేదు.
ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల షూటింగ్ డిలే అవుతోందని ఆ మధ్య టాక్ వచ్చింది. అదే సమయంలో దర్శకుడు వేరే సినిమా చేసి రావడంతో అందరూ ఆర్థిక సమస్యలు నిజమేనని నమ్మారు. ఇటీవల తిరిగి చిత్రీకరణ మొదలు పెట్టడంతో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయని అనుకున్నారు.
కానీ మళ్ళీ ఇప్పుడు హీరో సొంత సినిమాకు అవాంతరాలు ఎదురయ్యాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా జాప్యానికి అసలు కారణం ఇటీవల యువ హీరో ఫ్యామిలీ కొన్ని అసాంఘిక కార్యక్రమాల్లో ఇర్కుకోవడమే అని టాక్ నడుస్తోంది.
కెరీర్ ను ఎంతో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో.. ఇప్పుడు ఈ వ్యవహారం వల్ల అనుకోని చిక్కులు తెచ్చి పెట్టాయట. మరి మన హీరో వీలైనంత త్వరగా ఈ వ్యవహారాల నుంచి బయటపడి సాఫీగా సినిమాలు చేసుకుపోతారేమో చూడాలి.