Begin typing your search above and press return to search.

లిస్ట్: చెన్నై కోసం కదిలిన టాలీవుడ్

By:  Tupaki Desk   |   2 Dec 2015 1:14 PM GMT
లిస్ట్: చెన్నై కోసం కదిలిన టాలీవుడ్
X
విశాఖను హుద్ హుద్ తుఫాన్ ముంచెత్తినపుడు కోలీవుడ్ నటులు చేయూతనిస్తే.. ఇప్పుడు చెన్నై విలయానికి టాలీవుడ్ కదులుతోంది. కొంచెం ఆలస్యంగా మొదలైనా.. ఇప్పుడు విరాళాల వెల్లువ మొదలైంది. ఆన్ లైన్ సెన్సేషన్ సంపూర్ణేష్ బాబు 50వేల రూపాయలతో మొదలైన డొనేషన్లు ఇప్పుడు స్పీడందుకున్నాయి.

ప్రస్తుతానికైతే అందరి కంటే ఎక్కువగా పాతిక లక్షల విరాళం ప్రకటించి స్టైలిష్ స్టార్ తన దయాగుణాన్ని చాటుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు - యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు చెరో పది లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ - మాస్ మహరాజా రవితేజ తలో 5 లక్షలు విరాళం ప్రకటించారు. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ 3 లక్షలు ఇస్తున్నట్లు చెప్పాడు.

వరద బాధిత ప్రాంతాలకు 5 వేల ఆహార పొట్లాలు పంపుతున్నట్లు కుర్ర హీరో సందీప్ కిషన్ చెప్పాడు. తన లైఫ్ లో 18 ఏళ్లు చెన్నైలోనే గడిపానని.. ఐ లవ్ చెన్నై అంటూ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్. ప్రతీ ఒక్కరూ తమ దయాగుణాన్ని చాటుకోవాలంటూ ఎన్టీఆర్ సూచించాడు. ఈ ఘోరమైన పరిస్థితి తొందరగా అంతం కావాలని జగపతిబాబు కోరుకున్నాడు.

మొత్తం ఇప్పటివరకు డొనేషన్లు అందజేసిన మన సెలబ్రిటీల వివరాలు చూస్తే:

అల్లు అర్జున్ - 25 లక్షలు
మహేష్ బాబు - 10 లక్షలు
ఎన్టీఆర్ - 10 లక్షలు
కళ్యాణ్ రామ్ - 5 లక్షలు
రవితేజ - 5 లక్షలు
వరుణ్ తేజ్ - 3 లక్షలు
సాయిధరమ్‌ తేజ్ - 3 లక్షలు
సంపూర్ణేష్ బాబు - 50 వేలు
సందీప్‌ కిషన్ - 5 వేల ఫుడ్‌ ప్యాకెట్లు