Begin typing your search above and press return to search.
మన హీరోలు వెళితే ఒట్టు బాబోయ్
By: Tupaki Desk | 24 Aug 2016 10:30 PM GMTస్టార్ హీరోలు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోలకూ టాలీవుడ్ స్టార్ హీరోలకూ చాలా వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా ఒక సినిమాను ప్రమోట్ చేసే తీరులో మనోళ్లు మరీ ఈగోయిస్టులా అనే సందేహం వచ్చేస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ సూపర్ స్టార్లు అయిన అక్షయ కుమార్ - సల్మాన్ ఖాన్ - అమీర్ ఖాన్ కూడా.. మాల్స్ కు సైతం వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేస్తుంటారు. కాని మనోళ్ళున్నారే..
ఏదో చిన్న చిన్న సినిమాలు తీసే చిన్న దర్శకులూ.. హీరోలూ.. తప్పించి.. అసలు మన పెద్ద స్టార్లు ఎప్పుడైనా ఏదైనా మాల్ లో కనిపించారా? అబ్బే అంత సీన్ లేదు. కట్ చేస్తే.. సల్మాన్ ఖాన్ వంటి బడా స్టార్ కూడా చాలా రేడియో స్టేషన్లకు వెళ్ళి లైవ్ లో మాట్లాడుతున్నాడు. కాని మన స్టార్లు.. రేడియో జాకీలను అందరినీ తమ ఆఫీసులకు పిలిచి.. అక్కడే ఇంటర్యూలు ఇస్తుంటారు. ఇప్పుడు తన కొత్త సినిమాతో వస్తున్న ఒక యంగ్ స్టార్ కూడా అదే పనిచేస్తున్నాడు. వివిధ ఈవెంట్లలో కనిపించడం.. టివి షోలలో సందడి చేయడం.. అబ్బే వీళ్ళకు నచ్చదు. కేవలం ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఒక రోజు కేటాయించి.. అక్కడే మీడియా అందరికీ ఇంటర్యూలు ఇచ్చేస్తారు. అంతేకాని స్వయంగా వీళ్ళే బోలెడన్ని ఛానళ్ళకూ షోలకు మాత్రం వెళ్ళరు.
సర్లేండి.. ప్రమోట్ చేయకుండానే సినిమాలకు ఓపెనింగులు భారీగా వచ్చేస్తున్నాయి కాబట్టి.. అసలు ప్రమోషన్లు చేయాల్సిన అవసరం ఏంటి అనేదే మనోళ్ళ ఫీలింగ్. అంతేకాదు.. ఈ హార్డుకోర్ అభిమానులు ఉన్నంతవరకు సినిమాను ప్రత్యేకంగా వీళ్ళు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది. ఆడియో ఫంక్షన్లో నాలుగు పంచ్ డైలాగులు కొడితే చాలు.. ఆటోమ్యాటిక్ గా ప్రమోట్ అయిపోతుంది.