Begin typing your search above and press return to search.
హీరోలు జీతాలివ్వకుంటేనే వార్త.. ఇస్తే కాదు
By: Tupaki Desk | 9 May 2020 4:13 AM GMTలాక్ డౌన్ టైంలో దేశవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలూ ఆగిపోయాయి. ఈ సమయంలో పనుల్లేవు కాబట్టి ఆదాయం లేదు. దీంతో తమ కింద పని చేసే వాళ్లకు జీతాలివ్వడం కష్టమవుతోంది. అయినప్పటికీ ఎలాగోలా కష్టపడి జీతాలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు యజమానులు. కొందరు యజమానులు - కంపెనీలు తమ చేతుల్లో డబ్బులు లేకపోయినా అప్పు చేసి అయినా జీతాలిస్తుండటం గొప్ప విషయం. పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత తమ కింద పని చేసే వారికి జీతం ఇస్తున్నారు. ఐతే సినీ పరిశ్రమలో కూడా దాదాపుగా ప్రముఖులందరూ తమ స్టాఫ్ కు పని చేసినా చేయకపోయినా జీతాలిస్తున్నారు. పదుల కోట్లలో పారితోషకాలు తీసుకునే హీరోలు ఒకట్రెండు నెలల పాటు తమ స్టాఫ్ కు పని లేకున్నా జీతాలివ్వడం గొప్పయితే కాదు.
హీరోల దగ్గర ఓ పది మంది.. ఇంకా ఎక్కువ అనుకుంటే 20 మంది స్టాఫ్ ఉంటారేమో. వాళ్లందరికీ రెండు నెలల పాటు జీతాలివ్వడానికి ఎంత ఖర్చవుతుంది? హీరోల ఆదాయంతో పోలిస్తే ఇది ఏమాత్రం? ఇలాంటి సమమంలో మేం ఖాళీగా ఉన్నాం - మీకూ పని లేదు అని చెప్పి హీరోలు స్టాఫ్ కు జీతాలు ఇవ్వకపోతే అది వార్త అవుతుంది. ఈమాత్రం ఖర్చు కూడా భరించలేరా అన్న ప్రశ్న తలెత్తుతుంది. అంతే తప్ప వాళ్లు జీతాలివ్వడం పెద్ద విషయం కాదు. అది అసలు వార్తే కాదు. కానీ దీని గురించి పీఆర్వోలు ఘనంగా ప్రకటనలు ఇవ్వడం.. దాన్ని సోషల్ మీడియా - వెబ్ మీడియా ఓ వార్తలా చూడటమే ఆశ్చర్యం కలిగించే విషయం. సినీ రంగంలో హీరోల విషయంలో భజన ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇలాంటి ప్రచారాలు జనాలకు అతిగా అనిపిస్తాయి తప్ప.. సానుకూల అభిప్రాయం కలుగుతుందా అంటే సందేహమే.