Begin typing your search above and press return to search.
ఎవరికి వారే.. హెయిర్ స్టైల్ తీరే..
By: Tupaki Desk | 4 Feb 2016 5:30 PM GMTటాలీవుడ్ లో సినిమాలంటే ఓ ఫార్మాట్ లోనే ఉంటాయి. ఎప్పుడో ఒకటీ అరా ఏమన్నా ఛేంజ్ చూపించచ్చు కానీ.. సాధారణంగా అయితే మమమాస్ ఫ్లో కంటిన్యూ చేస్తున్నాయి. స్టోరీలు, కేరక్టరైజేషన్ పరంగా ఛేంజ్ చూపించే తీరు ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అయింది కానీ.. స్టయిలింగ్ - ప్రధానంగా హెయిర్ స్టైల్ విషయంలో మాత్రం మనోళ్లు బాగా డిఫరెన్స్ మెయింటెయిన్ చేస్తారు.
హెయిర్ స్టైల్స్ - గెటప్పుల విషయంలో ముందుగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ గురించే. ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపించడం - హెయిర్ స్టైల్ - మీసకట్టుతోనే గాంభీర్యాన్ని ప్రదర్శించడం బాలయ్య స్టైల్. సింహా - లెజెండ్ లలో అయితే గెటప్ తోనే సగం హిట్ కొట్టేశారీయన. హెయిర్ విషయంలో మహేష్ అంత కేర్ తీసుకోడని అంటారు కానీ.. పోకిరి మూవీ నుంచి సూపర్ స్టార్ బాగా మారాడు. ప్రతీ సినిమాకి మార్పు చూపిస్తూనే ఉన్నాడు.
ఇక అల్లు అర్జున్ ని అయితే, స్టైలింగ్ కి కేరాఫ్ అడ్రస్ అనాల్సిందే. ఇప్పటివరకూ ప్రతీ సినిమాలోనూ కొత్త కొత్తగా కనిపిస్తూనే ఉన్నాడు. ప్రతీ సినిమాకు డెవలప్ మెంట్ చూపిస్తున్న ప్రభాస్.. ఇప్పుడు బాహుబలితో అందనంత ఎత్తుకి చేరిపోయాడు. మున్నా - రెబల్ - డార్లింగ్ - బాహుబలి - శివుడు.. ఇలా ప్రతీ పాత్రకూ మార్పు చూపిస్తూనే ఆకట్టుకుంటున్నాడు. ఎన్టీఆర్ గెటప్స్ విషయం అంటే.. నాన్నకు ప్రేమతో గురించే పదిసార్లు చెప్పుకోవాలి, ఈ మూవీకి ఇదే అసలు స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయింది. గతంలో బాద్షాలోనూ బుల్లిగెడ్డంతో కనిపించాడు.
ఇక రామ్ చరణ్ కూడా గెటప్ - కాస్ట్యూమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. ఆరెంజ్ లోనే మూడు హెయిర్ స్టైల్స్ తో కనిపిస్తాడు. రచ్చ - బ్రూస్ లీ - గోవిందుడు అందరివాడే.. ఇలా పాత్రను బట్టి గెటప్ మార్చేస్తాడు చిరుత. ఇప్పుడు తనిఒరువన్ మూవీ కోసం కూడా కొత్త గెటప్ ని ప్లాన్ చేశాడు.