Begin typing your search above and press return to search.

ట్విట్టర్లో మన హీరోల ప్రాబ్లెం ఏంటి?

By:  Tupaki Desk   |   5 Oct 2015 3:30 PM GMT
ట్విట్టర్లో మన హీరోల ప్రాబ్లెం ఏంటి?
X
మొన్నా మధ్య ట్విట్టర్ బాస్ రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కు ఫాలోయర్లు ఇంత తక్కువున్నారేంటి అని తెగ ఫీలైపోయాడు. రెగ్యులర్ అప్ డేట్స్ ఇవ్వకుండా.. ఫ్యాన్స్ తో ముచ్చట్లు చెప్పకుండా ఫాలోయింగ్ పెరగాలంటే ఎందుకు పెరుగుతుంది చెప్పండి. ఈ సంగతి వర్మకు తెలియందేమీ కాదు. కానీ ఫ్యాన్స్ ను ఊరికే అలా గిచ్చడానికే కామెంట్లు పడేశాడు వర్మ. హీరోలకున్న ఫాలోయింగ్ సంగతి పక్కనబెట్టేద్దాం. ఇంతకీ మన హీరోలు ఎవరెవర్ని ఫాలో అవుతున్నారు. ఏమేం అప్ డేట్స్ తెలుసుకుంటున్నారు అని పరిశీలిస్తే ఆశ్చర్యం కలగడం ఖాయం.

వర్మ తెగ ఫీలైపోయిన పవన్ విషయమే తీసుకుంటే.. పవర్ స్టారుడు ట్విట్టర్ లో అడుగుపెట్టిన నాటి నుంచి ఏ ఒక్కర్నీ ఫాలో కావట్లేదు. పవన్ రాజకీయ ప్రకటనల కోసమే ట్విట్టర్ ఫాలో అవుతున్నాడు. కానీ పొలిటికల్ లీడర్లను కూడా ఫాలో కావట్లేదు. తాను ఎన్నికల్లో మద్దతు పలికిన నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడులను కుూడా పవన్ అనుసరించట్లేదు. ఇక తెలుగులో టాప్ మోస్ట్ ఫాలోవర్లను కలిగిన హీరో మహేష్ బాబుకు కూడా వేరే వాళ్లను ఫాలో కావడంపై ఇంట్రస్ట్ లేదు. అతను తన బావ గల్లా జయదేవ్‌ ను మాత్రమే ఫాలో అవుతున్నారు. అయినా ఫ్యామిలీ మెంబర్‌ ను ట్విట్టర్ లో ఫాలో అయి అప్ డేట్స్ తెలుసుకోవాల్సిన అవసరమేంటో మహేష్ బాబుకి. ట్విట్టర్ లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కూడా ఒక్కర్నీ ఫాలో కావట్లేదు. ఎన్టీఆర్ తన ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళిని మాత్రమే అనుసరిస్తున్నాడు. నాగార్జున చిత్రంగా ఒక్కర్నే అనుసరిస్తున్నాడు. ఆ ఒక్కడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కావడం విశేషం. ఐతే స్టార్ల సంగతిలా ఉంటే.. రానా దగ్గుబాటి - రామ్ - సందీప్ కిషన్ - నాని లాంటి వాళ్లు మాత్రం వేరే వాళ్లను బాగానే అనుసరిస్తుండటం విశేషం.