Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: హీరోలకే ఎందుకీ ఫైనల్ డెస్టినేషన్?
By: Tupaki Desk | 16 Jun 2019 4:43 AM GMTఅసలు ఈ టాలీవుడ్ కి ఏమైంది? ఏదో జరుగుతోంది? మన హీరోల్ని నీడలా ఏదో వెంటాడుతోంది. కారణం ఏదైనా రోజుకో యాక్సిడెంట్ వార్త వినాల్సి వస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అరడజను పైగానే హీరోలు కేవలం ఈ నాలుగు నెలల గ్యాప్ లో యాక్సిడెంట్లకు గురై తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఇదంతా చూస్తుంటే ఎవరో కక్ష కట్టి చేస్తున్న పనిలా .. ఏదో వెంటాడుతున్నట్టుగా సందేహం కలగకుండా ఉండదు.
రామ్ చరణ్.. ఎన్టీఆర్.. గోపిచంద్ .. నాగశౌర్య.. వరుణ్ తేజ్.. సందీప్ కిషన్ .. ఇలా ఒకరి తర్వాత ఒకరిగా వరుసగా గాయాల పాలయ్యారు. ఆన్ లొకేషన్ నటిస్తూ సడెన్ గా ప్రమాదానికి గురయ్యారంటూ వార్తలు వచ్చాయి. ఏదో పొరపాటున జరిగిందిలే అని సరిపుచ్చుకునేందుకు లేకుండా రోజుకో హీరో చొప్పున గాయాల పాలవుతుంటే ఆందోళన చెందడం అభిమానుల వంతైంది. ఈ యాక్సిడెంట్స్ వల్ల జరుగుతున్న నష్టం కూడా అంతా ఇంతా కాదు. ఒక్కో హీరో నెలల తరబడి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుండడంతో ఆ మేరకు దర్శకనిర్మాతలకు ఆర్థిక భారం పెరుగుతోందే కానీ.. శాంతి కలగడం లేదు. అయితే ఈ సన్నివేశాన్ని ప్రత్యేకంగా చూడాల్సి వస్తోంది.
మొన్నటికి మొన్న జక్కన్న సారథ్యంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ కి ఊహించని రీతిలో రెండుసార్లు బ్రేక్ వేయాల్సొచ్చింది. ఒకసారి చరణ్ కి.. ఇంకోసారి తారక్ కి యాక్సిడెంట్లు జరగడంతో ఆ ఇద్దరూ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల కీలకమైన షెడ్యూల్స్ కి విఘాతం తప్పలేదు. అటుపై హీరో గోపిచంద్ కి తిరు దర్శకత్వంలోని చాణక్య సెట్స్ లో కాస్త పెద్ద స్థాయిలోనే యాక్సిడెంట్ జరిగింది. అందులో గోపీకి తీవ్ర గాయాలు అవ్వడంతో నెలల పాటు విశ్రాంతి తప్పలేదు.
మొన్న .. అటు మొన్న.. నిన్న వరుసగా ముగ్గురు హీరోలు గాయాల పాలవ్వడం చూస్తుంటే ఇదేదో మిస్టీరియస్ సినిమానే తలపిస్తోంది. ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ ని తలపిస్తూ బెంబేలెత్తిస్తోంది. కుర్ర హీరోలు వరుణ్ తేజ్.. నాగశౌర్య.. సందీప్ ముగ్గురికీ జరిగిన ప్రమాదాలు చూస్తుంటే కచ్ఛితంగా ఫైనల్ డెస్టినేషన్ సినిమానే తలపించింది. వరుణ్ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఆ వార్త తెలిశాక.. కార్ లో ఆ టైమ్ లో బెలూన్ ఓపెన్ అవ్వకపోతే అంటూ అభిమానుల గుండెలు కొట్టుకున్నాయి. శౌర్య ఆన్ లొకేషన్ స్టంట్స్ చేయబోయి అడ్డంగా బుక్కయ్యాడు. కాలికి కట్టు కట్టి వీల్ ఛైర్ పై తీసుకెళుతున్న ఫోటోలు గుండెల్ని బరువెక్కించాయి. ఇక ఉన్నట్టుండి సందీప్ కిషన్ ఓ బాంబ్ బ్లాస్ట్ మిస్ ఫైర్ అవ్వడంతో అతడి ఛాతికి.. చేతికి గాజుముక్కలు గుచ్చుకున్నాయని .. వెంటనే కర్నూల్ లో వైద్యానికి తరలించామని బాంబ్ లాంటి వార్త పేలింది నిన్నటి సాయంత్రం. డే బై డే అసలేంటి ఈ క్రతువు? ఎందుకీ ప్రమాదాలు? ఎందుకిలా హీరోలనే ఫైనల్ డెస్టినేషన్ సీన్ వెంటాడుతోంది? ఇదేమైనా హాలీవుడ్ సినిమానా? జరగబోయే ప్రమాదాల్ని ముందే పసిగట్టి ఆపేయడానికి? అసలింతకీ ఏం జరుగుతోంది? ఈ సన్నివేశం నుంచి బయటపడేందుకు టాలీవుడ్ పెద్దలు ఏం చేయాలి?
ఇదివరకూ ఇలానే ఆ సందర్భం గగుర్పొడిచేలా చేసింది. టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు వారానికి ఒకరు చొప్పున ఆకస్మిక మరణాలకు గురవ్వడంతో సినీపెద్దలు ఖంగు తిన్నారు. వెంటనే టాలీవుడ్ కి అరిష్టం పట్టుకుందని ఇదివరకూ ఫిలింనగర్ దైవసన్నిధానంలో గ్రహదోష పూజలు చేశారు. ఆ పూజల ఫలమో ... ఇంకేదో దైవసంకల్పమో అటుపై ఆ మరణాలు తగ్గాయి. మరి ఈసారి హీరోలకు వరుస పెట్టి యాక్సిడెంటులేంటో? ఈసారి ఏం చేస్తారో?