Begin typing your search above and press return to search.
మన స్టార్లందరూ లేటు వీరులేనా?
By: Tupaki Desk | 1 July 2015 10:30 PM GMTఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. అనవసరంగా కాలయాపన చేస్తే పుణ్య కాలం కాస్తా గడిచిపోతుంది. పోయిన పెద్దాళ్లలానే, పోయిన కాలం తిరిగిరాదు. అందుకే దీపం ఉండగానే వేగంగా సినిమాల్లో నటించమని సలహాలు ఇస్తున్నారు విశ్లేషకులు. ఇప్పుడున్న హీరోల్లో ఒక్క మహేష్ తప్ప వేరే హీరోలెవరూ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.
చరణ్ ఏదైనా సినిమా అంగీకరించాలంటే ఎంతో ఆలోచిస్తున్నాడు. స్క్రిప్టు నుంచి దర్శకుడి ఎంపిక వరకూ ప్రతిదీ ఎంతో ఆలోచిస్తే కానీ ఓకే చెప్పడం లేదు. గోవిందుడు అందరివాడేలే తర్వాత మళ్లీ ఓ స్క్రిప్టుకి ఓకే చెప్పడానికి ఆరునెలల సమయం పట్టింది. అంతేనా అంతకంటే ముందే కొరటాలతో సినిమా ప్రారంభించి మరీ స్క్రిప్టు నచ్చక వద్దనుకున్నాడు. కోట్లాది రూపాయల్ని పందేరం వేయలేకే ఇలా చేస్తున్నా.. ఇది మరీ ఆలస్యం. ఈ ఆలస్యం అతడి కెరీర్‌కి ప్లస్సవుతుందని అనుకోలేం. అదే టైమ్‌లో మహేష్ ఏకంగా రెండు సినిమాలు చేసేంతటి దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఓవైపు కొరటాలతో శ్రీమంతుడు చిత్రీకరణ పూర్తి కాకముందే శ్రీకాంత్ అడ్డాలతో బ్రహ్మూెత్సవానికి సన్నాహాలు చేస్తున్నాడు.
పవన్ గురించి తెలిసిందే. ఇప్పటికే గబ్బర్‌సింగ్ 2 ప్రకటించి ఏడాదిన్నర అయ్యింది. ఓ దర్శకుడు మారాక ఇన్నాళ్టికి సెట్స్‌కెళ్లింది. బాబితో ఇదిగో అదిగో అంటూనే ఆరేడు నెలలు పైగానే అయ్యింది. అలాగే ఎన్టీఆర్ టెంపర్ కోసం ఏడాదిన్న టైమ్‌ని వేస్ట్ చేశాడు. కథా చర్చల దశనుంచే ఈ ఆలస్యం మొదలైంది. అయితే షూటింగ్ టైమ్‌లో రకరకాల ఇబ్బందులు మరింత ఆలస్యానికి కారణమయ్యాయి. అలాగే బన్ని సన్నాఫ్ సత్యమూర్తి షూటింగ్‌ని ఆరాంగానే చేశాడు. బాలయ్యబాబు లయన్ కూడా కూల్‌గానే తెరకెక్కింది. ఈ సినిమాలు రిలీజయ్యాకే మిగతా స్క్రిప్టులపై దృష్టి సారించారిద్దిరూ.. ఏ కోణంలో చూసినా మన హీరోలంతా తాబేలు నడక నడుస్తున్నారు.
ఆ రోజుల్లో సూపర్‌స్టార్ కృష్ణ, అందగాడు శోభన్‌బాబు ఏడాదికి పది, పదిహేను సినిమాల్లో నటించేస్తే ఈరోజుల్లో హీరోలు స్పీడ్‌ని కుదించేశారు. నిర్ణయాల్ని వేగంగా తీసుకోలేకపోవడం ఓ సమస్య అయితే నాణ్యమైన స్క్రిప్టుల్ని ఎలా ఎంచుకోవాలో అర్థంకాని వైఖరి కొంత. ప్రొడక్షన్‌లో నాణ్యత కోసమే ఇదంతా అని చెప్పి కవర్ చేసేద్దామన్నా కుదరని పరిస్థితి. హీరోలూ.. అలా కాకుండా వరుసగా సినిమాలు చేస్తూ స్పీడ్ పెంచేందుకు ప్రయత్నించండి. అప్పుడే టాలీవుడ్ ఫుల్ ఖుషీ అవుతుంది.