Begin typing your search above and press return to search.
మన హీరోలు స్పీడ్ పెంచాశారోచ్
By: Tupaki Desk | 6 Dec 2015 11:30 AM GMTహీరోలు చురుగ్గా లేరు. అస్సలు సినిమాలే చేయడం లేదు. నీరసంగా ఏడాదికో సినిమా చేస్తూ అలసత్వం ప్రదర్శిస్తున్నారు.. అంటూ ఇటీవలి కాలంలో మీడియా వాదించింది. అయితే ఆ వాదన ఫలించినట్టుంది. ఇప్పుడు హీరోలంతా ఏకకాలం లో రెండేసి ప్రాజెక్టుల్లో నటించేస్తున్నారు. మరోవైపు కథలు వింటూ కొత్త ప్రాజెక్టులకు సన్నాహాలు చేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా ఊరిరి తీసుకోకుండా ఆన్ సెట్స్ బిజీ అయిపోయారు. సేమ్ టైమ్ రిలీజ్ డెడ్ లైన్ ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుల్లో స్పీడ్ పెంచేశారు.
అలాంటి హీరోల చిట్టా తిరగేస్తే .. ఇప్పటికిప్పుడు మాస్ మహారాజ్ రవితేజ బెంగాల్ టైగర్ తో పాటు ఎవడో ఒకడు సినిమాకు సంబంధించిన బిజీగా ఉన్నాడు. బెంగాల్ టైగర్ రిలీజ్ కి వచ్చేస్తోంది కాబట్టి ఇక ఫోకస్ అంతా రెండో ప్రాజెక్టు పైనే. అలాగే నాగార్జున ఏకకాలంలో రెండు ప్రాజెక్టులు చేస్తున్నారు. ఓ వైపు సోగ్గాడే చిన్ని నాయనా చిత్రీకరణ పూర్తి చేసుకుంటూనే ఊపిరి చిత్రంలో నటిస్తున్నారు. సోగ్గాడే సంక్రాంతికి వచ్చేస్తుంది. ఆ తర్వాతి నెలలో ఊపిరి రిలీజ్. అదే కోవలో యువహీరో నారా రోహిత్ సావిత్రితో పాటు మరో రెండు ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. యంగ్ హీరో నాగచైతన్య ఓ వైపు సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో నటిస్తూనే, చందు మొండేటితో ప్రేమమ్ రీమేక్ కోసం కసరత్తులు చేశాడు.
బాలయ్య డిక్టేటర్ మూవీలో నటిస్తూనే 100వ సినిమా కోసం బోయపాటితో మంతనాలు సాగిస్తున్నారు. అలాగే బన్ని - నితిన్ ప్రస్తుతం ఆన్ సెట్స్ బిజీగా ఉంటూనే వేరే ప్రాజెక్టులకు సంబంధించిన కథలు వింటున్నారు. ఛోటామోటా హీరోలంతా ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టుల కోసం ఆత్రంగానే ప్లానింగులు వేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ కి కొత్త కళ వచ్చినట్టే. పనిలో స్పీడ్ పెంచారు. ఆలోచనల్లో పదును పెంచారు. ఇదంతా మన మంచికే.