Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: హైదరాబాద్ ని రౌండప్ చేశారు!
By: Tupaki Desk | 29 Sep 2021 12:30 AM GMT`లవ్ స్టోరి` రిలీజ్ తో థియేటర్ల రన్నింగ్ పై ఓ క్లారిటీ దొరికింది. జనాల్లో కరోనా భయం దాదాపు తొలగిపోయినట్లే కనిపిస్తుంది. జనం రోడ్లపై తండోపతండాలుగా అసలు మాస్కులే లేకుండా శానిటైజర్ తో పని లేకుండా ధైర్యంగా తిరుగుతుండడం పబ్లిగ్గానే కనిపిస్తోంది. ఇక థర్డ్ వేవ్ ముందుందని భయపెడుతున్నా.. ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి ప్రజలు ప్రస్తుతానికి భయాన్ని లైట్ తీసుకున్నారు అన్నది క్లియర్ కట్ గా అర్థమవుతోంది.
తెలంగాణతో పాటు ఏపీలో కూడా థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో రన్నింగ్ లోకి వచ్చేసాయి అంటే కారణమిదేనని ఒక సెక్షన్ విశ్లేషిస్తోంది. వినోదం ముందు కరోనా పరిగెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తిరిగి ఉప్పెన రోజుల్ని తేవడంలో లవ్ స్టోరి సఫలమవుతోందన్న వాదన వినిపిస్తోంది. ఇటీవలే మహరాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ లాక్ కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. దీంతో బాలీవుడ్ కి ఉప్పెన - లవ్ స్టోరి రోజులు రావాలని కోరుకుంటున్నారు.
రిలీజ్ లకు దేశవ్యాప్తంగా ఇక ఎలాంటి అడ్డంకులు ప్రస్తుతానికి లేనట్లే. అందుకే రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు కూడా రిలీజ్ తేదీలను ముందుగానే లాక్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్ సెట్స్ లో ఉన్న సినిమాల షూటింగ్ స్పీడ్ కూడా పెంచినట్లు తెలుస్తోంది.
ఎంత వేగంగా షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ చేస్తే అంత మంచిదని హీరోలు..దర్శక..నిర్మాతలు ఆలోచన చేస్తున్నారు. ఆ దిశగా కొత్త ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఔట్ డోర్ లో కాకుండా హైదరాబాద్ లోనే ఎక్కువ తెలుగు సినిమాల షూటింగులు జరుగుతున్నట్లు తాజ్ అప్ డేట్ ని బట్టి తెలుస్తోంది. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే... అల్లు అర్జున్ నటిస్తోన్న `పుష్ప` చివరి షెడ్యూల్ భూత్ బంగ్లా లో షూటింగ్ జరుగుతోంది. కింగ్ నాగార్జున నటిస్తోన్న `బంగార్రాజు` హయత్ నగర్ లో శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే వెంకటేష్- వరుణ్ తేజ్ నటిస్తోన్న `ఎఫ్ -3` కూడా ఫలక్ నుమా ఫ్యాలెస్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. నాని నటిస్తోన్న `అంటే సుందరానికి` చిత్రం మాదాపూర్ లో షూటింగ్ జరుపుకుంటోంది.
రవితేజ నటిస్తోన్న `రామారావు ఆన్ డ్యూటీ`..శర్వానంద్ నటిస్తోన్న `ఆడవాళ్లు మీకు జోహార్లు` షూటింగ్లు ఆర్ ఎఫ్ సీ లోనే జరుపుకుంటున్నాయి. ఇంకా గోపీచంద్ నటిస్తోన్న `పక్కా కమర్శియల్` కూడా హైదరాబాద్ పరిసరాల్లోనూ షూటింగ్ జరుపుకుంటోంది. ఇలా స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ అంతా హైదరాబాద్ నే రౌండప్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న `గాడ్ ఫాదర్` మాత్రం ఊటీ షెడ్యూల్లో ఉంది.