Begin typing your search above and press return to search.

హీరోయిన్ ఉచ్చులో ఆ డైరెక్టర్

By:  Tupaki Desk   |   12 Oct 2015 10:30 PM GMT
హీరోయిన్ ఉచ్చులో ఆ డైరెక్టర్
X
సినీ పరిశ్రమలో హీరో-హీరోయిన్లు.. డైరెక్టర్లు-హీరయిన్లు నడిపే ఎఫైర్లు మనకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి కానీ.. సినీ జనాలకు అది చాలా మామూలు విషయం. చాలామంది దర్శకులు, హీరోలు నడిపే ఎఫైర్ల గురించి ఇంట్లో వాళ్లకు తెలిసినా తెలియనట్లు ఉంటారు. విపరీతమైన ఒత్తడితో కూడుకున్న లైఫ్ ఇది కాబట్టి.. ఫ్యామిలీలో ఉన్నవాళ్లు కూడా ఈ ఎఫైర్లను లైట్ తీసుకుంటుంటారు. అలా ఇంట్లో వాళ్లు పోరు ఏమాత్రం లేని ఓ స్టార్ డైరెక్టర్.. ఎఫైర్లు నడపడంలో దిట్ట. ఎంత కష్టపడతాడో అంత ఎంజాయ్ చేయడానికి చూస్తుంటాడు. మన తెలుగు డైరెక్టర్లందరిలో ఆయనంతగా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాళ్లు ఇంకొకరు కనబడరు.

ఐతే ఇంతకుముందు చాలామందితో ఎఫైర్లు నడిపిన స్టార్ డైరెక్టర్.. కొంత కాలంగా ఓ సీనియర్ హీరోయిన్‌ తోనే కంటిన్యూ అవుతున్నాడు. ఆమె ఫేడవుట్ అయిపోయినా.. తననే పట్టుకుని వేలాడుతున్నాడు. ఐతే కొంత కాలం గడిచాక ఏ హీరోయిన్ కైనా టాటా చెప్పేసే డైరెక్టర్ ఈ అమ్మాయిని మాత్రం వదల్లేకపోతుండటం చాలా అనుమానాలకు తావిస్తోంది. మిగతా వాళ్ల నుంచి మూవ్ అయినట్లు ఈమెను నుంచి దూరం జరక్కపోవడం చూస్తుంటే ఆయన గుట్టేదో ఆమె దగ్గర ఉందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి జనాల్లో. చివరికి ఆ హీరోయిన్ దర్శకుడి వ్యవహారాలన్నింట్లో జొరబడిపోయి టూమచ్ ఫ్రీడమ్ తీసేసుకుంటోంది. ఈ వ్యవహారం ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి.