Begin typing your search above and press return to search.
సర్కారు వారు కళావతి కెరీర్ కు ప్లస్సా మైనస్సా..??
By: Tupaki Desk | 13 May 2022 4:00 AM GMT'మహానటి' సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది అందాల భామ కీర్తి సురేష్. తెలుగులో 'నేను శైలజ' 'నేను లోకల్' వంటి మరో రెండు హిట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్య కీర్తి కమర్షియల్ చిత్రాలు చేయడం తగ్గించేసింది.
చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో వరుసగా ఫీమేల్ సెంట్రిక్ చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. వాటిల్లో కూడా 'పెంగ్విన్' 'మిస్ ఇండియా' 'గుడ్ లక్ సఖి' వంటి సినిమాలు పరాజయం పాలయ్యాయి. దురదృష్టవశాత్తు కీర్తి సెలెక్ట్ చేసుకున్న సినిమాలన్నీ ప్లాప్ అవడంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది.
ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ నటించిన రెండు సినిమాలు వారం గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కీర్తి - సెల్వరాఘవన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘సాని కాయిదమ్’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ విధానంలో ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు.
ఈ క్రైమ్ డ్రామాని తెలుగులోకి డబ్ చేసి 'చిన్ని' అనే టైటిల్ తో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాలో కీర్తి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. మహానటికి మరో అవార్డ్ గ్యారంటీ అని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు తో కలిసి కీర్తి నటించిన 'సర్కారు వారి పాట' సినిమా నిన్న గురువారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. పరశురాం పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై స్టార్ హీరోయిన్ భారీ ఆశలే పెట్టుకుంది.
ఎందుకంటే కీర్తి నటించిన స్టార్ హీరోల సినిమాలు ప్లాప్ అవుతాయనే బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. పవన్ కళ్యాణ్ (అజ్ఞాతవాసి) - విజయ్ (ఏజెంట్ భైరవ) - విక్రమ్ (స్వామి 2) - సూర్య (గ్యాంగ్) - ధనుష్ (రైలు) - రజినీకాంత్ (అన్నత్తే) - మోహన్ లాల్ (మరక్కార్) వంటి హీరోలు దీన్ని నిజం చేశారు.
ఈ నేపథ్యంలో 'సర్కారు వారి పాట' సినిమా కీర్తి ని ఆ నెగెటివ్ సెంటిమెంట్ నుంచి బయట పడేస్తుందని అందరూ భావించారు. ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రావడంతో బ్లాక్ బస్టర్ పడుతుందని గట్టిగా నమ్మారు. కానీ ఈ మూవీకి తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో కళావతి అనే ఆకతాయి అమ్మాయి పాత్రలో కనిపించింది కీర్తి సురేష్.
గత సినిమాలతో పోలిస్తే కొంచెం ఒళ్లు చేసి ఆకర్షణీయంగా కనిపించింది. అలానే మహేశ్ బాబుతో అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకుంది. మహానటి నటన గురించి చెప్పేది ఏముంది. నేషనల్ అవార్డ్ అందుకున్న నటికి ఈ మాత్రం పాత్ర చేయడం విషయమేం కాదు. కాకపోతే ఫస్టాఫ్ లో ఉన్నంత స్కోప్.. ఆమెకు సెకండ్ హాఫ్ లో లేకుండా పోయింది.
ఏదైతేనేం కీర్తి సురేష్ తన పాత్ర వరకు న్యాయం చేసింది. అయితే 'సర్కారు వారి పాట' కు డివైడ్ టాక్ రావడంతో ఈ సినిమా కీర్తి కెరీర్ కు కెరీర్ కు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేక్ పడిందా? లేదా అదే కంటిన్యూ అయిందా? అనే చర్చ ఇప్పుడు నెట్టింట జరుగుతోంది. ఈ వీకెండ్ లో SVP సాధించే వసూళ్లను బట్టి అమ్మడి ఫేట్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఇకపోతే కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో 'భోళా శంకర్' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా నటిస్తోంది. అలానే నాని సరసన 'దసరా' అనే పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. మలయాళంలో హోమ్ బ్యానర్ లో 'వాసి' సినిమా షూటింగ్ పూర్తి చేసింది. అలానే 'మామన్నన్' అనే తమిళ మూవీలో నటిస్తోంది కీర్తి.