Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాకు బై చెప్పిన టాలీవుడ్ హీరోయిన్!

By:  Tupaki Desk   |   20 April 2021 9:30 AM GMT
సోషల్ మీడియాకు బై చెప్పిన టాలీవుడ్ హీరోయిన్!
X
దేశంలో ఓవైపు కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి లక్షల్లో కేసులు.. వేలసంఖ్యలో మరణాలు అనే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఓ టాలీవుడ్ సెలబ్రిటీ తాజాగా తాను సోషల్ మీడియా నుండి కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ ఛార్మి. గతేడాది కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ విషయంపై ఛార్మి ఫన్నీ టిక్ టాక్ వీడియో చేసి తీవ్రంగా ట్రోల్స్ బారినపడింది. ఆ వీడియోలో ఛార్మి.. 'కరోనా విజయవంతంగా తెలంగాణలోకి వచ్చేసింది. అందరికి అభినందనలు' అంటూ వీడియో పోస్ట్ చేసింది.

అప్పట్లో ఆమె కామెడీగా పోస్ట్ చేసింది కానీ ఇప్పటికి కరోనా మనదేశం వదిలిపోలేదు. ఇంకా రోజురోజుకి ప్రబలుతూనే ఉంది. అయితే ఛార్మి వీడియో కారణంగా చాలామంది హర్ట్ అయ్యారని అర్ధం చేసుకుంది. ప్రస్తుతం దేశంలో పరిస్థితి దారుణంగా ఉన్నాయని చెబుతూ సోషల్ మీడియాకు బై చెప్పింది. అలాగే 'నేను ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటాను. కానీ నేనే ఈ పెయిన్ భరించలేకపోతున్నాను. అసలే దేశం దారుణమైన పరిస్థితిలో ఉంది. మిమ్మల్ని మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోండి. నిజంగా ఈ మహమ్మారి పెడుతున్న బాధలను నేను చూడలేకపోతున్నాను. కనీసం దానిగురించి వినడానికి కూడా సిద్ధంగా లేను. కొన్నిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని డిసైడ్ అయ్యాను" అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఛార్మి లైగర్ సినిమాకు సహానిర్మాతగా వ్యవహరిస్తోంది.