Begin typing your search above and press return to search.
టాలీవుడ్ విలన్లుగా వాళ్లకి స్కోప్ లేదా?
By: Tupaki Desk | 20 Feb 2017 5:14 AM GMTటాలీవుడ్ కి చాలా మంది విలన్స్ వస్తూ ఉంటారు.. వెళుతూ ఉంటారు. పక్క భాషల నుంచి విలన్స్ ను తీసుకొచ్చి ఆనందించడంలో.. మనకంటే బెస్ట్ ఎవరూ ఉండరనే విమర్శలు కూడా వినిపిస్తుంటాయి. అయితే.. లీడింగ్ హీరోయిన్లను విలన్లుగా చూపించేందుకు మన మేకర్స్ అస్సలు ధైర్యం చేయారు.
మన సినిమాల్లో ఫిమేల్ విలన్స్ అంటే.. అత్త కేరక్టర్లు మాత్రమే. కానీ మిగిలిన ఇండస్ట్రీలలో మాత్రం ఆకట్టుకునే కేరక్టర్లతో హీరోయిన్లను విలన్లుగా చూపించేస్తున్నారు. తెలుగులో చివరగా నరసింహ మూవీలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రే స్ట్రాంగ్ ఫిమేల్ విలన్. అది కూడా తమిళ్ డబ్బింగ్ సినిమానే. 'మన దేశంలో ఒక హీరోయిన్ నెగిటివ్ రోల్ పోషించిందంటే.. ఆ తర్వాత రొమాంటిక్ పాజిటివ్ రోల్స్ కి పనికి రారు అని చాలా మంది భావిస్తారు. అందుకే ఇలాంటి రోల్స్ ఎక్కువగా కనిపించవు' అని చెప్పింది రకుల్.
ప్రస్తుతం తమిళ్ లో తెరకెక్కుతున్న వీఐపీ2 మూవీలో బాలీవుడ్ సీనియర్ భామ కాజోల్ నటిస్తోంది. ఆమె చేస్తున్నది విలన్ రోల్ కావడం విశేషం. గతేడాది రిలీజ్ అయిన కోడి(తెలుగులో ధర్మయోగి)లో త్రిష ఇలాంటి రోల్ నే చేసింది. ఓ దశాబ్దం క్రితం పచ్చకిల్లి ముతుచారం అనే మూవీలో విలన్ గా నటించింది జ్యోతిక.
హిందీలో ప్రస్తుతం తెరకెక్కుతున్న కమాండో2 చిత్రంలో ఈషా గుప్తా విలన్ రోల్ లో కనిపించనుంది. 1990ల్లో వచ్చిన గుప్త్ మూవీలో కాజోల్ చేసిన విలన్ పాత్రను ఇప్పటికీ మరిచిపోలేరు ఆమె అభిమానులు. అజ్నబీలో బిపాషా బసు.. ఐత్ రాజ్ లో ప్రియాంక చోప్రా.. రేస్ లో కత్రినా కైఫ్ లు విలన్స్ గా చేశారు.
అయినా వీళ్లంతా తమ కెరీర్ ని బాగానే గ్లామరస్ గానే కంటిన్యూ చేయగలిగారు. కానీ తెలుగులో మాత్రం హీరోయిన్స్ కి విలన్ రోల్ ఇచ్చే ధైర్యం ఎవరూ చేయడం లేదు. ఇందుకు జనాలు ఒప్పుకోరనే కారణం చెబుతుంటారు మూవీ మేకర్స్. కానీ ఇక్కడ మారాల్సింది కాదని.. అంత స్ట్రాంగ్ కేరక్టర్లను క్రియేట్ చేసి.. మెప్పించగలిగే సత్తా వారికే ఉండాలని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/