Begin typing your search above and press return to search.
పర్స్ చూసి పాత్రలు పట్టించుకోట్లేదా?
By: Tupaki Desk | 19 Sep 2016 10:30 PM GMTఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వచ్చిన ప్రతీ పాత్రను చేయడం.. కొంచెం క్రేజ్ వచ్చాక సెలెక్టివ్ గా ఉండడం.. స్టార్ స్టేటస్ అందుకున్నాక తమ రేంజ్ ని బట్టి సినిమాలు ఒప్పుకోవడం.. ఇదీ తాము సినిమాలు ఒప్పుకునే తీరు అని హీరోయిన్లు చెబుతూ ఉంటారు. కానీ భారీ రెమ్యూనరేషన్ తో ఆఫర్ వస్తే మాత్రం.. ఇలాంటివేమీ పట్టించుకోవడం లేదనే విషయం అర్ధమవుతోంది.
'నాకు పాత్ర నచ్చితేనే సినిమా చేస్తా' లాంటివన్నీ మాటలకే పరిమితం అయిపోతున్నారు. కొత్తోళ్లు కూడా కామన్ గా ఈ డైలాగే చెబుతుండడంతో.. జనాల్లా కామెడీ అయిపోతోంది. రీసెంట్ రిలీజ్ లు చూస్తే.. అసలు పట్టుమని పది సీన్లు కడా లేని సినిమాలు చేసిన విషయం అర్ధమైపోతుంది. ఈ లిస్ట్ లో నయన తార.. నిత్యామీనన్.. కాజల్.. సమంత.. తమన్నా లాంటి టాప్ హీరోయిన్స్ కూడా ఉంటున్నారు. బాబు బంగారంలో నయనతార పాత్ర చూస్తే.. ఆమె స్థాయికి.. ఈ పాత్రకు మధ్య చాలా అంతరం కనిపిస్తుంది. జనతా గ్యారేజ్ లో అయితే సమంత.. నిత్యా మీనన్ లు సందడి చేశారు. ఎవరి పాత్రకీ ఏమాత్రం ఇంపార్టన్స్ ఉండదు. ఇక తమన్నా అయితే.. భారీ పారితోషికం ఇస్తే చాలు.. ఐటెం సాగ్స్ కూడా చేసేస్తోంది. అలాగే ఇంకొక్కడు సినిమాలో నిత్యా మీనన్ రోల్ చూస్తే.. పాపం అనిపిస్తుంది.
స్టోరీలు బాగుండడంతో.. పాత్రలను పట్టించుకోలేదనే కవరింగ్ కబుర్లు మాత్రం కామన్ గానే చెప్పేస్తున్నారు. టోటల్ సినిమా బాగుండేలా చూసుకోకుండా.. మా పాత్రలే చూసుకుంటే కెరీర్ లో వెనకబడిపోతాం అన్నది వీరి వాదన. ఏదేమైనా పర్సులో నిండుతున్న కాసులు చూసుకుని.. పాత్రలను పట్టించుకోవట్లేదు అనే కామెంట్ చేయడం తప్పేం లేదులే.