Begin typing your search above and press return to search.

కేథరిన్ కేసులో ఖైదీ తప్పెంత!!

By:  Tupaki Desk   |   18 Oct 2016 4:16 AM GMT
కేథరిన్ కేసులో ఖైదీ తప్పెంత!!
X
మెగా మూవీ ఖైదీ నెంబర్ 150లో ఐటెం సాంగ్ చేయాల్సిన కేథరిన్ థ్రెసాను తప్పించిన సంగతి తెలిసిందే. సినిమాకు స్టైలిస్ట్ అయిన చిరు డాటర్ సుశ్మితతో తేడాలొచ్చాయని.. కొరియోగ్రఫీ అందిస్తున్న లారెన్స్ తో గొడవ పడిందని రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇలాంటి గొడవలు హీరోయిన్స్ పేరు పైనే తప్ప హీరోలతో వచ్చిన సందర్భాలు పెద్దగా కనిపించవు.. ఉన్నా బైటకు రావు.

షూటింగ్ కి ఈవెంట్స్ కు హీరోయిన్లు ముందే వచ్చి కూచుంటే.. తర్వాతెప్పుడో హీరో గారు గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంటారని.. తమ సినిమా అయ్యే వరకూ డేటింగ్ చేయకూడదని( టైగర్ ష్రాఫ్ తో మున్నా మైకేల్ మూవీ కోసం నిధి అగర్వాల్ కి పెట్టిన కండిషన్)రకరకాల రూల్స్ పెడుతుంటారని.. ఇండస్ట్రీలో హీరోయిన్స్ ను తక్కువగా చూస్తుంటారని వాదనలు బయల్దేరాయి. కేథరిన్ ఇష్యూతో ఏవో కనిపెట్టేశామనే ఫీలింగ్ తో బయటివాళ్లే ఇలాంటివి ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇదే ఇష్యూపై ఇండస్ట్రీలో జనాల రియాక్షన్ మాత్రం డిఫరెంట్ గా ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం.

కొత్తగా వచ్చే హీరోయిన్లు చిన్నచిన్న వాటిని కూడా ఇష్యూ చేయడం కోసం ఏదో ఒకటి చేస్తుంటారని.. నిర్మాతగా తనకు కూడా ఇలాంటి అనుభవం ఉందని లక్ష్మి మంచు చెబుతోంది. ఓ డ్రస్ కంఫర్టబుల్ గా లేకపోతే.. ఆ విషయాన్ని డైరెక్టుగా చెప్పి మార్చుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుందని.. ఇలాగే చేయాలని ఎవరూ బలవంతపెట్టే పరిస్థితి లేదంటున్న హీరోయిన్ కామ్మ జెఠ్మలానీ.. ఆ హీరోయిన్ ను బయటకు పంపడానికి ఇది కారణం అయుండదని అంటోంది.

చేసే పాత్ర విషయంలో అన్నీ డైరెక్టర్ తీసుకునే నిర్ణయం అని.. స్క్రీన్ పై కనిపించడం అంతా ఆయన ఇష్టమే కదా అంటోంది ప్రగ్యా జైస్వాల్. మొత్తం మీద ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండడం ఇండస్ట్రీలో సహజమే అయినా.. మెగాస్టార్ సినిమా అనేసరికి.. సెన్సేషనలిజం కోసం పని కట్టుకుని కొందరు చేస్తున్న ప్రచారమే ఇదంతా అనే టాక్ కూడా వినిపిస్తోంది. అదీ నిజమే కావచ్చని.. ఎందుకంటే కేథరిన్ థ్రెసా ఈ విషయంపై అసలు మాట్లాడ్డం లేదు కదా అంటున్నారు ఫిలింనగర్ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/