Begin typing your search above and press return to search.
పడిలేచిన సొగసు కెరటాలు..
By: Tupaki Desk | 1 Dec 2015 7:30 PM GMTవిజయం ఎప్పుడూ మొదటి ప్రయత్నంతోనే రాకపోవచ్చు. అయితే తమ పరాజయాన్ని గుణపాఠాలుగా తీసుకుని కృషితో మరోసారి ప్రయత్నించేవారికి ఎప్పటికైనా విజయం దక్కుతుంది. సినిమా రంగం కూడా ఇందుకు మినహాయింపుకాదు. ఇక్కడ హీరోలు ఎక్కువగా స్టార్ బ్యాక్ డ్ర్రాప్ లో వచ్చిన వారే కాబట్టి ఒకటికాకపోతే మరో అవకాశం వుంటుంది. మరి కేవలం అందాల ఆరబోతకే పరిమితమవుతున్న హీరోయిన్ల సంగతేంటి?
ఈ విషయానికొస్తే ప్రస్తుత తరం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు కూడా మొదటి సినిమాలు ఫ్లాప్ టాక్ ముటగాట్టుకున్నవే. అరుంధతితో జేజమ్మగా అలరించిన అనుష్క మొదటి సినిమా సూపర్ ఫ్లాప్. గబ్బర్ సింగ్ నుంచి గోల్డెన్ లెగ్ గా పిలవబడుతున్న శృతిహాసన్ అంతకు ముందు ఫ్లాపులతో ఐరెన్ లెగ్ గా విమర్శలు ఎదుర్కుంది. తమన్నా హ్యాపీ డేస్ కి ముందు 'శ్రీ' అనే చిత్రంలో నటించిన విషయం చాలామందికి తెలియనే తెలియదు.
ఇలా వారి మొదటి సినిమాలు ఫ్లాపయినా పట్టువదలని విక్రమార్కురాళ్ళుగా వెండితెరపై వారుచేసిన ప్రయత్నయమే వారికి విజయాన్ని అందించింది. తెలుగు ఇండస్ట్రీలో కధానాయికల కొరత కూడా వీరి రెండవ అవకాశానికి కారణమన్న వాదన సైతం లేకపోలేదు.