Begin typing your search above and press return to search.
మెగా క్యాంప్‌లో ముగ్గురు హాట్ గాళ్స్
By: Tupaki Desk | 28 July 2015 7:38 AM GMTమొదట్లో కాజల్, తమన్నా తర్వాత రెజీనా, అమలాపాల్... వీళ్లంతా మెగా క్యాంప్ లో పాగా వేసి, వరుసగా ఛాన్సులు దక్కించుకున్నవారే. ఒక్క ఛాన్స్ సాధించి, సత్తా చూపిస్తే... కనీసం 3-4 సినిమాలు చేతిలో వచ్చి పడ్తాయి. అదీ మెగా ఫ్యామిలీ లెక్క. కానీ ఇదంతా ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడీ ఫ్యామిలీ ప్యాక్ లోకి... కొత్తగా ముగ్గురు గుమ్మలు వచ్చి చేరారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
తన పొడుగాటి పాదాలతో... ఈ క్యాంప్ లో అడుగు పెట్టిన ఆ ముగ్గురిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. డైరెక్టుగా రామ్ చరణ్ తోనే ఛాన్స్ కొట్టేసి, ఫైటర్ తోపాటు ఆడిపాడుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని... దసరాకి రిలీజ్ కు సిద్ధం చేస్తున్నాడు శ్రీనువైట్ల. చెర్రీ తో జత కట్టిన వెంటనే... బన్నీ-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూవీలో కూడా రకుల్ సెలక్ట్ అయింది. ఒక వేళ ఈ రెండు పిక్చర్స్ సక్సెస్ సాధిస్తే... ఈ యంగ్ హీరోలతో మరోసారి డ్యూయెట్స్ పాడేస్తుంది కూడా.
మెగా క్యాంప్ లో రాశి ఖన్నా కూడా ఎంటరైంది. సాయి ధరం తేజ్ తో... అనిల్ రావిపూడి తీస్తున్న మూవీ లో నటిస్తోంది రాశి. సోలో పరశురామ్ డైరెక్షన్లో... అల్లు శిరీష్ తో కలిసి సందడి చేస్తోంది లావణ్య త్రిపాఠి. అందాలరాక్షసిగా సినీ ఇండస్ట్రీలోకి 4ఏళ్ల ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటివరకూ బ్రేక్ రాలేదు ఈ అమ్మడికి. ఇప్పుడు మెగా క్యాంప్ పై లావణ్యకు చాలా ఆశలే ఉన్నాయి. మొత్తం ముగ్గురు అప్ కమింగ్ క్రేజీ హీరోయిన్లు పెద్ద క్యాంప్‌లోకి ప్రవేశించారు. వీరిలో ఎవరి అదృష్టం ఎలా ఉండనుందో.