Begin typing your search above and press return to search.
నత్తనడకన ముందుకు సాగుతున్న టాలీవుడ్ స్టార్ హీరోలు..!
By: Tupaki Desk | 10 Nov 2022 3:30 AM GMTఈరోజుల్లో స్టార్ హీరోల నుంచి ఏడాదికో సినిమా రావడం గగనమై పోయింది. సరైన కాంబినేషన్ కుదరడానికి.. షూటింగ్ ప్రారంభమవాడనికి.. ఎలాంటి అవాంతరాలు లేకుండా చిత్రీకరణ పూర్తవడానికి.. ఫైనల్ గా అన్ని అడ్డంకులు దాటుకొని మంచి విడుదల తేదీ చూసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి మధ్య చాలా సమయమే పడుతోంది.
టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలు కూడా స్లో అండ్ స్టడీగానే ముందుకు సాగుతున్నారు. 20 ఏళ్లకు పైగా సినీ కెరీర్ ఉన్న హీరోల ఫిల్మోగ్రఫీలో గట్టిగా 20 సినిమాలు కూడా ఉండటం లేదంటే.. ఎంత నెమ్మదిగా వర్క్ చేస్తున్నారనేది అర్థం అవుతుంది.
ఇప్పుడు మన స్టార్స్ అందరూ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్నారు. బిజీగా ఉన్నారని చెప్పుకోవడమే కానీ.. ఏ సినిమా కూడా జెట్ స్పీడ్ తో చిత్రీకరణ జరుపుకోవడం లేదు. అవి కూడా అప్పుడెప్పుడో అనౌన్స్ చేసి సినిమాలు.. చాలా కాలం క్రితమే సెట్స్ మీదకు తీసుకొచ్చిన చిత్రాలు కావడం గమనార్హం.
"బాహుబలి" వంటి భారీ ఫ్రాంచైజీ కోసం ఐదేళ్లు కేటాయించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఆ తర్వాత వరుసగా ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తూ వస్తున్నారు. ఆదిపురుష్ - సలార్ - ప్రాజెక్ట్ K - మారుతి సినిమా - స్పిరిట్.. ఇలా ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టారు. కాకపోతే ఆశించిన విధంగా సినిమాలు కంప్లీట్ అవ్వడం లేదు. "రాధే శ్యామ్" రిలీజైన తర్వాత ఏడాదికి గానీ డార్లింగ్ నుంచి తదుపరి మూవీ రావడం లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు గతేడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 సినిమాని అనౌన్స్ చేశారు. 2022 ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో లాంచ్ చేస్తే.. సెప్టెంబర్ లో రెగ్యులర్ షూట్ కి వెళ్ళింది. ఇప్పటికి ఇంకా రెండో షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరున విడుదల అని ప్రకటించారు కానీ.. పరిస్థితులు చూస్తుంటే కష్టమే అనిపిస్తోంది.
త్రివిక్రమ్ మూవీ తర్వాత ఎస్ ఎస్ రాజమళి దర్శకత్వంలో మహేశ్ బాబు ఓ బిగ్ మూవీ చేయనున్నారు. జక్కన్న సినిమాలు ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తాయో.. ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేం అంటుంటారు. అందులోనూ ఈసారి దర్శకుడు గ్లోబల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇంకాస్త ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది.
'అరవింద సమేత వీర రాఘవ' సినిమా తరవాత RRR కే పరిమితమైన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఎనిమిది నెలలవుతున్నా ఇంతవరకూ తన తడుపరి చిత్రాన్ని మొదలు పెట్టలేదు. కొరటాల శివతో అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన NTR30 ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. రెగ్యులర్ షూట్ కి వెళ్ళడానికి టైమ్ పడుతుందని అంటున్నారు. ఇది పూర్టైన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ మూవీ చేయనున్నాడు.
ఈ ఏడాది RRR మరియు ఆచార్య చిత్రాల్లో కనిపించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి వస్తుందనుకున్న ఈ మూవీ.. వచ్చే యేడాది రావడం కష్టమే అంటున్నారు. ఇక గౌతమ్ తిన్ననూరితో అనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని తెలుస్తోంది. దీంతో RC16 ఎవరితో ఉంటుందనేది క్లారిటీ రావడం లేదు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 1' సినిమా వచ్చి దగ్గర దగ్గర యేడాది కావస్తున్నా.. ఇప్పటికీ రెండో భాగం రెగ్యులర్ షూట్ మొదలు పెట్టలేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్ళినా.. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. దీని తర్వాత బన్నీ ఇంకా కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేయలేదు.
వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. వరుసగా సినిమాలు లైన్ లో పెట్టుకున్నారు కానీ.. అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోయారు. ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు అంటూ రెండు పడవల మీద బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అందుకే హరి హర వీరమల్లు ఇంకా సెట్స్ మీదనే వుంది. భవదీయుడు భగత్ సింగ్ అసలు ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందో చెప్పలేకుండా వుంది.
ఎవరి కారణాలు వాళ్ళకున్నప్పటికీ.. టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రేక్షకులకు రెగ్యులర్ గా సినిమాలు అందించలేకపోతున్నారు. వీళ్ళని చూసి టైర్-2 హీరోలు కూడా ఇప్పుడు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. జనాలను థియేటర్లకు రప్పించగలిగే స్టార్ డమ్ ఉన్న హీరోలంతా ఏడాదికి కనీసం ఒకటీ రెండు సినిమాలు చేస్తే.. ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. మరి రానున్న రోజుల్లో అయిన మన హీరోలు ఆ దిశగా ఆలోచన చేస్తారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.