Begin typing your search above and press return to search.

దేవుడి ల్యాండ్ నుంచి ఎత్తుకొస్తున్నారు

By:  Tupaki Desk   |   12 Jan 2016 10:30 PM GMT
దేవుడి ల్యాండ్ నుంచి ఎత్తుకొస్తున్నారు
X
ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్‌ లోకి మాలీవుడ్ ముద్దుగుమ్మ‌ల ప్ర‌వాహం పెరిగింది. అశిన్‌ - న‌య‌న‌తార‌ - నిత్యామీన‌న్‌ - మ‌మ‌తా మోహ‌న్‌ దాస్‌ - అమ‌లాపాల్‌ - పూర్ణ.. ఇలా సీనియ‌ర్ల జాబితాని ప‌రిశీలిస్తే వీళ్లంతా సౌత్‌ లో టాప్ రేంజుకి వెళ్లిపోయిన‌వారే. అదే బాట‌లో మ‌రికొంత మంది క‌థానాయిక‌లు సౌత్ ఇండ‌స్ర్టీలో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు వ‌స్తున్నారు.

వీరిలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ - కీర్తి సురేష్‌ - మాళ‌విక నాయిర్‌ - న‌మిత ప్ర‌మోద్‌ - నివేద థామ‌స్.. ఈ పేర్లు కొత్త‌గా వినిపిస్తున్నాయ్‌. ఇటీవ‌లి కాలంలో యువ‌హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటూ టాలీవుడ్‌ లోకి దూసుకొచ్చారు వీళ్లంతా. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో మాళ‌విక ప్రామిస్సింగ్ స్టార్‌ గా ప్రూవ్ చేసుకుంది. నేను- శైల‌జ మూవీతో కీర్తి సురేష్ ప్రూవ్ చేసుకుంది. అనుప‌మ ప్రేమ‌మ్ రీమేక్‌ తో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఇక న‌మిత ప్ర‌మోద్ వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఆది స‌ర‌స‌న చుట్టాల‌బ్బాయ్ సినిమాలో న‌టిస్తోంది.

వీళ్లంతా భ‌విష్య‌త్ తార‌క‌లు అంటే త‌ప్పేం లేదు. అయితే ఇలా మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌ల్నే మ‌న తెలుగు ప‌రిశ్ర‌మ‌లోకి ఎందుకు ఆహ్వానిస్తున్నారు? అన్న ప్ర‌శ్న‌కు అట్నుంచి స‌మాధానం వినిపించింది. మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లంతా ముక్త కంఠంతో చెబుతోంది ఒక్క‌టే. మ‌ల్లూ వుడ్ ఓ దేవుడి లోకం లాంటిది. అక్క‌డ దేవుడు అందాల్ని చెక్కుతాడు. వాళ్లను మ‌నం ఇంపోర్ట్ చేసుకుంటాం.. అంటూ చెప్పుకొచ్చారు. ఇటు సౌత్ లుక్‌ - అటు నార్త్ అప్పీయ‌రెన్స్ రెండూ ఈ భామ‌ల్లో ఉంటాయి క‌నుకే వాళ్ల‌ను ఇటు తెస్తున్నాం.. అని చెబుతున్నారంతా. నిజ‌మే మ‌రి దేవుడి ల్యాండ్ నుంచి ఎత్తుకొస్తున్న‌ట్టే మ‌రి!