Begin typing your search above and press return to search.
పెద్దరాయుడికి అంత సీన్ ఉందా?
By: Tupaki Desk | 3 Jan 2022 10:30 AM GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నడూ లేనిది.. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు.. తెలుగు ఇండస్ట్రీకి కంట్లో నలుసుగా మారిపోయింది. సినిమా టికెట్ల ధరలు తగ్గించడంతో తెలుగు సినీ ఇండస్ట్రీ విలవిల్లాడుతోంది. అదేసమయంలో ధియేట్లపై దాడులు చేసి.. వాటిని మూతబడే లా చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీ నుంచి చిన్నపాటి హీరోలు గళం వినిపించారు. అయితే.. పెద్ద హీరోలు మాత్రం మాకెందుకు మా కాళ్ల కిందకు నీళ్లు వచ్చాయా? అంటూ.. తప్పుకొన్నారు.
ఇక, ఈ సమస్యలపై గళం వినిపించే సినీ ఇండస్ట్రీ పెద్దలు ఎవరూ కూడా ముందుకు రాలేదు. గతంలో దివంగత దాసరి నారాయణరావు.. సినిమా ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరించి.. అనేక సమస్యలకు పరిష్కా రం చూపించారు. ఆ తరహా పెద్దరికం ఇప్పుడు ఎవరూ చేయడం లేదు. పోనీ.. చిరంజీవి ఉన్నారనే ఆశలు సజీవంగానే ఉన్నా.. ఇటీవల ఆయన ఇలాంటి వివాదాల్లో పెద్దరికం పాత్రం పోషించే సాహసం తాను చేయబోనని స్పష్టం చేసేశారు. అంటే.. పెద్దన్న పాత్ర నుంచి మెగాస్టార్ తప్పుకున్నట్టేనని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నారు.
మరి ఇప్పుడు ఎవరు ఈ పాత్ర పోషిస్తారు? అనే ప్రశ్న వచ్చినప్పుడు.. పెద్దరాయుడు మోహన్‌బాబు.. ముందుకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక లెటర్‌ను ఆయన లీక్ చేశారు. కానీ, లెటర్ లీక్ చేసినంత మాత్రాన.. ఇండస్ట్రీకి ఏమీ చేయకుండా.. ఇండైరెక్టుగా అందరినీ విమర్శించి చేస్తున్నారనేది పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న అంశం. ఏపీ ప్రభుత్వానికి.. ముఖ్యంగా సీఎం జగన్ కు పెద్దరాయడు కుటుంబంతో బంధుత్వమే ఉంది. ఆయన కుమారుడు..మా అధ్యక్షుడు మంచు విష్ణుకు జగన్ ఫ్యామిలీతో దగ్గరి చుట్టరికం ఉంది.
అయినప్పటికీ సినిమా టికెట్ల వ్యవహారంతో కానీ, ధియేటర్ల మూసివేత సమయంలో కానీ రియాక్ట్ కాలేదు. నిజానికి మంచు ఫ్యామిలీ నుంచి ఏమాత్రం రియాక్షన్ ఉన్నా.. ఏపీ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడి ఉండేది. పైగా మా అసొసియేషన్ తరఫున ఏ సమస్యపైనైనా స్పందిస్తానని చెప్పిన విష్ణు.. ఏపీ విషయానికి వస్తే.. మౌనంగా ఉన్నారు. ఈ పరిణామాలు గ్రహించిన తర్వాత.. మూవీ ఇండస్ట్రీ.. పెద్దరాయుడికి ఎలా సపోర్టు చేస్తుంది. ఇదే విషయాన్ని వారు కుండబద్దలు కొడుతున్నారు. మేం ఆయనకు సపోర్టు చేసేది లేదని చెబుతున్నారు. సో.. దీనిని బట్టి పెద్దరాయుడుకు.. అంత సీన్ లేదనేది స్పస్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.