Begin typing your search above and press return to search.
స్పెషల్ షోల పేరుతో ఈ రచ్చ ఏంటండీ..?
By: Tupaki Desk | 2 Sep 2022 2:30 PM GMTతమ ఫేవరేట్ హీరోల పుట్టినరోజును అభిమానులు పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి కేకులు కట్ చేసి హంగామా చేస్తుంటారు. తమ హీరో బాగుండాలంటూ వారి పేరు మీద సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నెట్టింట సెలబ్రేషన్స్ ఎక్కువయ్యాయి. కామన్ డీపీలు హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ చేస్తూ.. తమ హీరోకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు స్టార్ హీరోల బర్త్ డేలకు స్పెషల్ షోలు వేయడమనేది ట్రెండ్ గా మారింది.
హీరోల కెరీర్లో క్లాసిక్స్ లేదా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలను కొందరు అభిమానులు తమ సొంత ఖర్చులతో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోలో కాకుండా దేశ విదేశాల్లోనూ భారీ ఎత్తున స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ చివరి వారంలో 'ఒక్కడు' & 'పోకిరి' సినిమాలను స్పెషల్ గా ప్రదర్శించారు. రీ రిలీజ్ ను తలపిస్తూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్ లలో షోలు వేశారు. ఈ విధంగా వచ్చిన డబ్బును సామాజిక కార్యక్రమాలకు వినియోగించారు.
స్పెషల్ షోల ట్రెండ్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అనుసరించారు. పవన్ నటించిన 'జల్సా' సినిమా ప్రత్యేక షోలను వరల్డ్ వైడ్ గా నిర్వహించారు. పలు ఏరియాల్లో 'తమ్ముడు' సినిమాని కూడా ప్రదర్శించారు.
ఇలా ఇద్దరు అగ్ర హీరోల అభిమానులు బాగా సమన్వయం చేసుకుని రికార్డు స్థాయిలో సినిమా స్పెషల్ షోలు ఏర్పాటు చేశారు. తమ అభిమాన హీరోల పుట్టినరోజును ప్రత్యేకంగా నిలిచేలా చేశారు. ఇదే ట్రెండ్ ను యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఫాలో అవ్వనున్నారు. డార్లింగ్ బర్త్ డేకి 'రెబల్' సినిమా 4K వెర్షన్ స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ.. అత్యుత్సాహంతో కొందరు అభిమానులు రచ్చ చేయడమే ఇప్పుడు విమర్శలు వచ్చేలా చేస్తోంది. 'పోకిరి' సినిమా స్క్రీనింగ్ సమయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ కొందరు బీభత్సం సృష్టించారు. కొన్ని థియేటర్లలో స్క్రీన్స్ ను డ్యామేజ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆల్ రెడీ కాకినాడలో ఒక కాంప్లెక్స్ బ్యాన్ చేసారని సమాచారం.
ఇప్పుడు 'జల్సా' మూవీ స్క్రీనింగ్ సమయంలోనూ అవాంఛనీయ సంఘనలు చోటుచేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక థియేటర్ లో సీట్లు విరగ్గొట్టి అద్దాలు ధ్వంసం చేశారని తెలుస్తోంది. అంతేకాదు టికెట్లు అమ్ముడుపోక ఓ షో క్యాన్సిల్ చేయగా.. ఫ్యాన్స్ థియేటర్ పై రాళ్లు రువ్వి ఆస్తి నష్టం కలిగించారు.
స్పెషల్ షోలు వేయడం వరకూ ఓకే గానీ.. ఇలా థియేటర్‌లను ధ్వంసం చేయడం వల్ల హీరోలకు చెడ్డ పేరు వస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హీరో సినిమాల స్పెషల్ షోలకు ప్రేక్షకులు దూరంగా ఉండే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే స్పెషల్ షోల ట్రెండ్ ను కూడా కొందరు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ గా మారుస్తున్నారు. స్పెషల్ షోలతో తమ హీరోల స్టార్ డమ్ ని లెక్క గడుతున్నారు. మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ సినిమాల ప్రత్యేక ప్రదర్శనల తర్వాత ఇద్దరు హీరోల అభిమానులు నెట్టింట గొడవకు దిగారు.
మా హీరో సినిమా ఇన్ని స్క్రీన్ లలో ప్రదర్శించాం అంటే.. దాన్ని మించి మా హీరో సినిమా స్పెషల్ షోలు వేశామంటూ ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో దాడి చేసుకుంటున్నారు. ఇది కచ్చితంగా స్వాగతించే విషయం కాదు. పరోక్షంగా తమ హీరోలను ప్రతిష్టను దిగజార్చే అవకాశం ఉంది.
ఇది ఇలానే కొనసాగితే స్పెషల్ షోల ట్రెండ్ ను హీరోలు కూడా ఎంకరేజ్ చేయకపోవచ్చు.. దర్శక నిర్మాతలు సపోర్ట్ గా నిలిచే అవకాశం లేదు. మరి అభిమానులు ఇప్పటి నుంచైనా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తిస్తారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.