Begin typing your search above and press return to search.

ముగింపులో మెరుపులు క‌ష్ట‌మేనా?

By:  Tupaki Desk   |   4 Oct 2022 2:30 AM GMT
ముగింపులో మెరుపులు క‌ష్ట‌మేనా?
X
ప్ర‌తీ ఏడాది ప్రారంభం అదిరిపోయావాల‌ని, అదే త‌ర‌హాలో ఇయ‌ర్ ఎండింగ్ ముగింపు కూడా స‌రికొత్త మెరుపులు ముగించాల‌ని ప్ర‌తీ రంగంలోనూ ప్ర‌త్యేకంగా కోరుకుంటారు. సినిమా ఇండ‌స్ట్రీ అయితే మ‌రింత ప్ర‌త్యేకంగా చూస్తారు. అయితే ఈ ఏడాది ప్రారంభం సినీ ఇండ‌స్ట్రీకి పెద్ద‌గా క‌లిసిరాలేదు. చాలా వ‌ర‌కు క్రేజీ సినిమాలు ఏడాది ప్రారంభం లో సంద‌డి చేసి శుభారంభాన్ని అందిచాల‌నుకున్నాయి. కానీ కోవిడ్ థ‌ర్డ్ వేడ్ కార‌ణంగా అది సాధ్య‌ప‌డ‌లేదు.

థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా ఈ ఏడాది జ‌న‌వ‌రిలో సంక్రాంతి బ‌రిలోకి దిగాల‌నుకున్న 'RRR', రాధేశ్యామ్ పోటీ నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ఈ రెండు సినిమాల కార‌ణంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 'భీమ్లానాయ‌క్‌' ని కూడా పోటీ నుంచి త‌ప్పిచేశారు. దీంతో భారీ సినిమాల‌తో శుభారంభం ప‌ల‌కాల్సిన 2021 చివ‌రికి నాగ్ , నాగ‌చైత‌న్య‌ల 'బంగార్రాజు'తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌టంతో ఆ త‌రువాత డీజే టిల్లు, భీమ్లానాయ‌క్ విడుద‌లై మంచి విజ‌యాల్ని అందించి నూత‌నోత్తేజాన్ని క‌లిగించాయి.

దీంతో వేస‌వికి విడుద‌లైన 'RRR', కేజీఎఫ్ 2' సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో కాసుల వ‌ర్షం కురిపించి మ‌రింత జోష్ ని అందించి బాక్సాఫీస్ కు స‌రికొత్త క‌ళ‌ని తీసుకొచ్చాయి. ఆ త‌రువాత అర్జున క‌ల్యాణం నుంచి కార్తికేయ 2 వ‌ర‌కు విడుద‌లైన సినిమాల్లో కొన్ని మాత్ర‌మే బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డులు సృష్టించి అద‌ర‌గొట్టాయి. రెండు నెల‌లు వ‌రుస ఫ్లాపులు ఎదుర‌వుడంతో ఇండ‌స్ట్రీ ప‌రిస్థితి ఏంట‌నే సందిగ్థ‌త‌లో వున్న ద‌శ‌లో ఆగ‌స్టు 5న‌, 13న విడుద‌లైన సీతారామం, బింబిసార‌, కార్తికేయ 2 సినిమాలు కొత్త ఊపిరి పోశాయి.

ఇదిలా వుంటే ముగింపైనా త‌మ‌దైన మెరుపుల‌తో టాలీవుడ్ మెస్మ‌రైజ్ చేస్తుందా? అనే చ‌ర్చ మొద‌లైంది. ప్రారంభం థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా స‌రైన ఆరంభం ద‌క్క‌క‌పోవ‌డంతో ముగింపు అయినా చెప్పుకోద‌గ్గ రీతిలో వుంటుందా? అన్న‌ది ఇప్ప‌డు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు స‌గ‌టు ప్రేక్ష‌కుడి మ‌దిని తొలిచేస్తోంది. అయితే తాజా ప‌రిణామాల‌ని బ‌ట్టి చూస్తుంటే ఎడింగ్ లో మెరుపులు క‌ష్ట‌మ‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఈ ద‌స‌రాకు మెగాస్టార్ 'గాడ్ ఫాద‌ర్‌'తో , కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్'తో బ‌రిలోకి దిగుతున్న విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ వీరి సినిమా రావాలంటే వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఆగాల్సిన ప‌రిస్థితి.

చిరు 'భోళా శంక‌ర్‌', వాల్తేరు వీర‌య్య సినిమాలు సెట్స్ పై వున్నాయి. అయితే ఇవి వ‌చ్చే ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు', ప్ర‌భాస్ 'ఆదిపురుష్‌' వ‌చ్చే ఏడాదే రానున్నాయి. వీరితో పాటు రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ నుంచి శ‌ర్వానంథ్ వ‌ర‌కు ప్ర‌తీ హీరో ఒక్కో సినిమాతో బిజీగా వున్నారు. వీరు కూడా వ‌చ్చే ఏడాదే సంద‌డి చేయ‌నున్నారు. పోనీ ఈ ఏడాది ఎండింగ్ లో మాస్ రాజా ర‌వితేజ‌, నంద‌మూరి బాల‌కృష్ణ అయినా సంద‌డి చేస్తారా అంటే అది అనుమాన‌మే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.

ర‌వితేజ న‌టిస్తున్న 'ధామాకా' షూటింగ్ పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. దీపావ‌ళికి రిలీజ్ అని కొంత మంది.. లేదు డిసెంబ‌ర్ లోనే వ‌స్తుంద‌ని కొంత మంది అంటున్నారు. ఇక బాల‌కృష్ణ తొలిసారి గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్ లో యాక్ష‌న్ డ్రామాని చేస్తున్నాడు. దీని చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరింది. డిసెంబ‌ర్ 'అఖండ‌' సెంటిమెంట్ ప్ర‌కారం రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ఆలోచ‌న కానీ బాల‌య్య మాత్రం సంక్రాంతి అంటున్నార‌ట‌.

సీనియ‌ర్ అండ్ టైర్ 2 హీరోల ప‌రిస్థితి ఇలా వుంటే యంగ్ హీరోలు మాత్రం న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకున్న నిఖిల్ ఇయ‌ర్ ఎండింగ్ లో '18 పేజెస్‌'తో రానున్న‌ట్టుగా తెలుస్తోంది. న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్ లో ఈ మూవీ రిలీజ్ కానుంద‌ట‌. ప్ర‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ దీనికి ద‌ర్శ‌కుడు. ఇక నిఖిల్ త‌ర‌హాలోనే 'మేజ‌ర్‌'తో బ్లాక్ బ‌స్ట‌ర్ ని ద‌క్కించుకున్న అడివి శేష్ కూడా 'హిట్ 2'తో రాబోతున్నాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ మూవీ డిసెంబ‌ర్ 2న థియేట‌ర్ల‌లోకి రానుంది.

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఓరి దేవుడా'. విక్ట‌రీ వెంక‌టేష్ దేవుడి పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి బ‌జ్ క్రియేట్ అయింది. పీవీపీతో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేయ‌బోతున్నారు. 'నాంది'తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేసిన అల్ల‌రి న‌రేష్ ఇయ‌ర్ ఎండింగ్ లో 'ఇట్లు మారేడు మిల్లి ప్ర‌జానీకం'తో రాబోతున్నాడు. వీరిత‌ర‌హాలోనే స‌త్య‌దేవ్ రామ్ సేతు, గుర్తుందా సీతాకాలం, కృష్ణ‌మ్మ సినిమాల‌తో సందడి చేయ‌బోతున్నాడు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం 'విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌, రూల్స్ రంజ‌న్ సినిమాల‌తో రాబోతున్నాడు. అయితే స‌మంత 'య‌శోద‌', తేజ స‌జ్జ 'హ‌నుమాన్' ఈ ఏడాది వ‌స్తాయా అన్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు అనుమాన‌మే. ఇయ‌ర్ ఎండింగ్ లో భారీ సినిమాలు లేక‌పోవ‌డంతో ముగింపులో మెరుపులు క‌ష్ట‌మే అని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.