Begin typing your search above and press return to search.
కరోనా కంటే మొండిగా తయారైన టాలీవుడ్
By: Tupaki Desk | 8 May 2021 1:30 AM GMTకరోనా మహమ్మారీ మొదటి వేవ్ వచ్చి వెళ్లింది. టాలీవుడ్ లో యథావిధిగా సినిమాలు రిలీజయ్యాయి. జనం కూడా ఏమీ పట్టనట్టు థియేటర్లకు వచ్చారు. సినిమాల్ని బ్లాక్ బస్టర్ హిట్లు చేశారు. సెకండ్ వేవ్ వచ్చింది. కానీ అప్పటికే అలవాటు పడ్డారు. ఆ సంగతి వకీల్ సాబ్ తో నిరూపణ అయ్యింది. ఈ సినిమా బంపర్ కలెక్షన్లు దానికి సాక్ష్యం.
ఎప్పుడూ ఏదో ఒక మార్పు వచ్చినప్పుడు ఇండస్ట్రీ బలోపేతం అవుతూనే ఉంటుంది అని సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ కి చెప్పినట్టే అంతా జరుగుతోంది. బాహుబలి రిలీజ్ తర్వాత పాన్ ఇండియా మార్కెట్ పెరిగింది. ఆ సంగతిని సూపర్ స్టార్ ముందే చెప్పారు. ఇప్పుడు కరోనా వేవ్ తర్వాత ఇంకే మార్పు రాబోతోందో కానీ.. అంతా మేలే జరుగుతుందని భావించడం పాజిటివిటీ పెంచుకోవడం కిందే లెక్క.
ఇకపై డిజిటల్ వీక్షణ పెరుగుతుంది.. ఓటీటీ పెరిగింది. అలాగని థియేట్రికల్ రంగం దెబ్బవ్వలేదు. అది తిరిగి కొత్త మార్గాల్లో పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
మొదటి వేవ్ వచ్చినప్పుడు పడినంత టెన్షన్ ఇప్పుడు లేదు. నెమ్మదిగా జనం అలవాటు పడ్డారు. చాలా వరకూ మందులతో హోంఐసోలేషన్ లోనే తగ్గిపోతోంది. చాలామంది సినీకార్మికులు వ్యాక్సినేషన్లు వేయించుకుని సురక్షిత మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఉపాధి కోసం వెంపర్లాడుతున్నారు. రెట్టించిన బలంతో ఉద్వేగంతో కుటుంబాల కోసం పని చేస్తున్నారు. షూటింగులు ఆగినా ఆ సమయాన్ని సద్వినియోగం చేయడం ఎలాగో మొదటి వేవ్ లోనే మన స్టార్లు చూపించారు. సెకండ్ వేవ్ లోనూ మళ్లీ కథలు విని డైరెక్టర్లను ఫైనల్ చేస్తున్నారు. యథావిధిగా అన్నీ సాగుతున్నాయి. కొన్నాళ్లు షూటింగులు ఆగుతాయి అంతే. రిలీజ్ తేదీలు మూడు నాలుగు నెలలు వాయిదా.. అంతవరకే.
మే చివరి నాటికి తిరిగి పరిస్థితులు సద్ధుమణిగే వీలుందన్న ధీమా చాలామందిలో ఉంది. క్రమ క్రమంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తయిపోతుంది కాబట్టి అప్పటికి ఇంకా ధీమా వచ్చేస్తుంది. ఇక షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వాల నుంచి అడ్డంకుల్లేవ్. ధైర్యం ఉంటే చేసుకుంటూ వెళ్లడమే. ఇక దీనికి కూడా అలవాటు పడిపోయారు. సెట్లో అంటుకుంటే మందులు వేసుకుంటున్నారు. ఇక వైరస్ ని మించి మానవాళి మొండిగా మారుతున్నారు! అనడానికి ఇదే సాక్ష్యం. చాలామంది చనిపోయేవాళ్లు వైరస్ వల్ల కంటే మనోధైర్యం కోల్పోవడం వల్లనే అనేది డాక్టర్లు చెబుతున్నది. అందువల్ల ఇప్పుడు ధైర్యం పెంచుకునే సీజన్ అని నమ్మాలి.
కొన్ని సినిమా యూనిట్లలో 1500 చెల్లించి వ్యాక్సినేషన్లను వేయించుకుంటున్నారట. ఇక ఏమాత్రం కోవిడ్ తగ్గుముఖం పట్టినా థియేట్రికల్ రిలీజ్ ల గురించి ఆలోచిస్తారు. ప్రస్తుతానికి మే-జూన్ -జూలైలో విడుదల కావాల్సిన సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేయాలన్న సందిగ్ధత ఉంది. కాస్త ఆగి ప్లాన్ చేస్తారు. వీటికి సంబంధించిన ప్రమోషన్లు ఇక ఆపరట. ఫస్ట్ లుక్ లు.. సెకండ్ లుక్ లు.. పాటలు ఇవన్నీ సామాజిక మాధ్యమాల్లో రిలీజవుతూనే ఉన్నాయి. ఎవరి ధైర్యం వారు చూపిస్తున్నారు. బాక్టీరియాలకు వైరస్ లకు భయపడరిక.