Begin typing your search above and press return to search.

సౌత్ ఇండ‌స్ర్టీ కి టాలీవుడ్ హ‌బ్..ఇదే సాక్ష్యం!

By:  Tupaki Desk   |   28 July 2022 2:30 AM GMT
సౌత్ ఇండ‌స్ర్టీ కి టాలీవుడ్ హ‌బ్..ఇదే సాక్ష్యం!
X
ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌కి తెలుగు చ‌న‌ల చిత్ర ప‌రిశ్ర‌మ హ‌బ్ గా మారుతోందా?  సౌత్ ప‌రిశ్ర‌మలోకెల్లా టాలీవుడ్ ప్ర‌త్యేక స్థానం క‌ల్గి ఉందా? అంటే అవున‌నే అనిపిస్తుంది. ఇటీవ‌ల చోటుచేసుకుంటోన్న కొన్ని సంఘ‌ట‌న‌లు..స‌మీక‌ర‌ణాలు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సౌత్ ఇండ‌స్ర్టీలో అతి పెద్ద ప‌రిశ్ర‌మ‌గా తెలుగు..త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల‌కు పేరుంది.

క‌న్న‌డ‌..మ‌ల‌యాళం ఇండ‌స్ర్టీలు ఈ రెండు  ప‌రిశ్ర‌మ‌తో పోల్చుకుంటే చాలా చిన్న‌వి. సౌత్  నుంచి రిలీజ్ అయ్యే   భారీ బ‌డ్జెట్ సినిమాలన్నీ తెలుగు..త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల నుంచే క‌నిపిస్తాయి. అయితే `బాహుబ‌లి` స‌క్సెస్ త‌ర్వాత తెలుగు ప‌రిశ్ర‌మ రేంజ్ మారింది. అటుపై రిలీజ్ అయిన `ఆర్ ఆర్ ఆర్` .. `పుష్ప‌` సినిమాలు పాన్ ఇండియాలో పెద్ద విజ‌యం సాధించ‌డంతో టాలీవుడ్ రెట్టింపు క్రేజ్ తో దూసుకుపోతుంది.

ఇటీవ‌లి కాలంలో చోటుచేసుకుంటోన్న సంకేతాలు అందుకు మ‌రింత బ‌లం చేకూర్చాయి.  కోలీవుడ్ న‌టులు..ద‌ర్శ‌కులు తెలుగులో సినిమాలు  చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. తెలుగు ప‌రిశ్ర‌మ‌తో పోటీ ప‌డిన ప‌రాయి ప‌రిశ్ర‌మ న‌టులిప్పుడు తెలుగు మార్కెట్  కోసం ముందుకు క‌దులుతున్నారు.  తెలుగుతో పాటు ఏక కాలంలో త‌మిళ్ లోనూ ఆయా చిత్రాలు తెర‌కెక్కిస్తున్నారు.

ఒక‌ప్పుడు కేవ‌లం అనువాద రూపంలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చే హీరోలిప్పుడు హైద‌రాబాద్ లో తిష్ట వేసి  త‌మ సినిమాల్ని ప్ర త్యేకంగా మార్కెట్ స‌హా ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి  ఎంతో  ఆస‌క్తి చూపిస్తున్నారు. అవిభాజిత ఆంద్ర‌ప్ర‌దేశ్ ఏర్పాటు అయిన దగ్గ‌ర నుంచి ఈ ఒర‌వ‌డి మ‌రింత పెరిగింది. హైద‌రాబాద్ తో పాటు...వైజాగ్ సిటీలోనూ పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం  నిర్వ‌హిస్తున్నారు.

ఇక క‌న్న‌డ న‌టులు..మ‌ల‌యాళం న‌టులు తెలుగు హీరోస్ సినిమాల్లో చాలా కాలంగా భాగ‌మ‌వుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ఆ వేగం మ‌రింత పెరిగింది. తెలుగు సినిమా ఆఫ‌ర్ అంటే?  సౌత్ నుంచి  ఏ న‌టుడు వ‌దులు కోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. అవ‌స‌ర‌మైతే తాము హీరోగా న‌టిస్తోన్న సినిమాలు సైతం ప‌క్క‌న‌బెట్టి ముందుకొస్తున్నారు.

అలాగే హైద‌రాబాద్ హ‌బ్ గా ప‌ర‌భాషా సినిమాల షూటింగ్ లు త‌రుచూ జ‌రుగుతున్నాయి.  క‌నీసం ఒక షెడ్యూల్ అయినా రామోజీ ఫిలిం సిటీలో చిత్రీక‌రించే ప్లానింగ్ తో ముందుకొస్తున్నారు. గ‌డిచిన ద‌శాబ్ధ‌ కాలంలో ఇలాంటి మార్పులెన్నో  వ‌చ్చాయి. సాంకేతికంగాను టాలీవుడ్ ఎంతో వృద్దిలోకి వ‌చ్చింది. అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో స్టూడియోల నిర్మాణానికి త‌ల పండిన దిగ్గ‌జాలు ముందుకొస్తున్నారు.  

ఇక నాలుగైదేళ్ల‌గా బాలీవుడ్ సైతం హైద‌రాబాద్ ని హ‌బ్ గా మార్చ‌కుని త‌మ సినిమాల్ని ప్ర‌చారం చేసుకుంటోంది. ఇప్ప‌డీ విధానంలోనూ చాలా మార్పులొచ్చాయి.  తెలుగు స్టార్ హీరోల్ని త‌మ సినిమా ప్ర‌చారంలో భాగం చేస్తున్నారు. రిలీజ్ కి ముందు టాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు స్పెష‌ల్ షోలు  వేస్తున్నారు. కొంత మంది దిగ్గ‌జాల రాక‌తో టాలీవుడ్-బాలీవుడ్ మ‌ధ్య  ఉన్న వ్య‌త్యాసం చెరిగిపోయింద‌ని చెప్పొచ్చు. ఇలా  ఇన్ని ర‌కాల మార్పుల‌తో టాలీవుడ్ స్థాయి..రూపంలో మార్పుల్ని స్ప‌ష్టంగా గ‌మ‌నించ‌వ‌చ్చు.