Begin typing your search above and press return to search.
టాలీవుడ్ జేమ్స్ కామెరూన్ అంటూ అరుదైన గౌరవం
By: Tupaki Desk | 22 Jan 2023 12:30 AM GMTహాలీవుడ్ మీడియాలో అసాధారణ గౌరవం అందుకున్న ఏకైక ఇండియన్ దర్శకుడు ఎవరు? అంటే.. ఈ ప్రశ్నకు భారతదేశంలో ఎవరైనా చాలా సింపుల్ గా జవాబు చెప్పగలరు. నేడు దేశం గర్వించదగ్గ దిగ్ధర్శకుడిగా తెలుగు వాడైన ఎస్.ఎస్. రాజమౌళి ప్రపంచ సినీయవనికపై తనదైన ముద్ర వేస్తూ దూసుకెళుతున్నాడు. బాహుబలి ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టి ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో పాన్ వరల్డ్ మార్కెట్ ని దక్కించుకున్నాడు. ఈ సినిమాతో ప్రపంచ సినీపండగల్లో అవార్డులు రివార్డులు దక్కాయి. రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. అందుకే ఏ సామాన్యుడిని అడిగినా ప్రముఖుడిని అడిగినా రాజమౌళి పేరు ఇట్టే చెప్పేస్తారు.
ఇక భారతదేశం నుంచి ఏ ఒక్క దర్శకుడికి దక్కని అరుదైన గౌరవం తెలుగు వాడైన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి దక్కింది. టాలీవుడ్ జేమ్స్ కామెరూన్ అని పిలుపు అందుకోవడం అంటే..! ఆ పిలుపే ఎంతో గౌరవం. రాజమౌళిని టాలీవుడ్ జేమ్స్ కామెరూన్ అంటూ పొగిడేసిన ప్రఖ్యాత 'హాలీవుడ్ రిపోర్టర్' అతడిపై సంచలన కథనాలు వెలువరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫాలోయింగ్ ఉన్న పాపులర్ పోర్టల్ అరుదైన గౌరవాన్ని మన జక్కన్నకు కట్టబెట్టింది అంటే అది సామాన్య విషయం కాదు. దేశంలో మణిరత్నం- రాజ్ కుమార్ హిరాణీ- సంజయ్ లీలా భన్సాలీ- మధుర్ భండార్కర్- సిద్ధార్థ్ ఆనంద్ సహా యష్ రాజ్ సంస్థానంలో పని చేసే దర్శకులకు దక్కని అరుదైన గౌరవమిది. ఎందరో దిగ్ధర్శకులకు దక్కని గౌరవంగా చూడాలి.
'అవార్డ్స్ కబుర్లు' పాడ్ కాస్ట్ - S. S. రాజమౌళి (RRR) పేరుతో తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ పోర్టల్ ఆసక్తికర కథనాన్ని వెలువరించింది.టాలీవుడ్ కు చెందిన జేమ్స్ కామెరూన్ తన నిర్మాతల ఆలోచనలను ప్రతిబింబిస్తూ పాన్-ఇండియన్ సినిమాని రూపొందించడానికి సహకరిస్తారు. భారతదేశంలోని అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రం.. అత్యంత ప్రశంసలు పొందిన ఏకైక చిత్రంగా నిరూపించిన ఆర్.ఆర్.ఆర్ వెనక దేవుడు అతడు. భారతదేశంలోని ఇద్దరు పెద్ద తారలను ఒకచోట చేర్చిన ప్రతిభావంతుడు! అంటూ జక్కన్నను హాలీవుడ్ రిపోర్టర్ ఆకాశానికెత్తేసింది.
ది హాలీవుడ్ రిపోర్టర్స్ అవార్డ్స్ కబుర్లు పేరుతో తాజా పోడ్ కాస్ట్ ఎపిసోడ్ లో అతిథిగా S. S. రాజమౌళి పాల్గొన్నారు. భారతదేశానికి చెందిన ఒక దర్శకుడు తెలుగు భాషా సినిమాలో కెరీర్ ని ప్రారంభించి తన సినిమాలతో కమర్షియల్ విజయాలు సాధిస్తూ.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటూ..సుస్థిరమైన ట్రాక్ రికార్డ్ ను కలిగి ఉన్నాడు. అందుకే అతడిని టాలీవుడ్ జేమ్స్ కామెరూన్ అని పిలవడానికి నామోషీ లేదు! అంటూ హాలీవుడ్ రిపోర్టర్ పోర్టల్ తన పోడ్ కాస్ట్ లో అలాగే పోర్టల్ కథనంలో పేర్కొంది.
విలక్షణమైన స్వభావం -ప్రతిభ కలిగిన కళాకారుడిగా న్యూయార్క్ టైమ్స్ ఇంతకుముందు ఒక కథనాన్ని రాజమౌళిపై రాసింది. మ్యాగ్జిమమ్ యాక్షన్ కథతో ఊహాజనిత సెట్ లతో అద్భుతాలు చేసే నైపుణ్యం కలిగిన ప్రతిభావంతమైన దర్శకుడిగా రాజమౌళికి గుర్తింపు ఉంది. అతడు తెరకెక్కించిన సినిమాలలో చాలా వరకు డైనమిక్ స్పెషల్ గా ఉండే ఎఫెక్ట్స్ కొరియోగ్రఫీ తో అలరిస్తాయి. అని లాస్ ఏంజిల్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
భారత దేశంలోని ప్రముఖ పవర్ హౌస్ ఫిలింమేకర్స్ లో ఒకరు రాజమౌళి. మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. ఇవి భారతదేశ ఆస్కార్ లకు సమానం..భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు కూడా అతడే. ఎందుకంటే అతని మూడు సినిమాలు వరుసగా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదు చిత్రాల జాబితాలో ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి కూడా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించినవి. 2015 లో బాహుబలి: ది బిగినింగ్.. 2017లో బాహుబలి 2: ది కన్‌క్లూజన్ .. 2022 లో RRR చిత్రాలతో సంచలన విజయాలు సాధించిన దర్శకదిగ్గజం రాజమౌళి అంటూ సదరు హాలీవుడ్ పత్రికలు ప్రశంసలు కురిపించాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.