Begin typing your search above and press return to search.

100 పాట‌ల‌ ర‌చ‌యిత దొంగ‌త‌నాలు

By:  Tupaki Desk   |   29 Oct 2018 4:54 AM GMT
100 పాట‌ల‌ ర‌చ‌యిత దొంగ‌త‌నాలు
X
అత‌డు పాట రాస్తే యువ‌త‌రం ఊగిపోవాలి! ఆడిపాడాలి..! తేజ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ ఏరికోరి అత‌డితో పాటలు రాయించుకునేవారు. చిత్రం - నువ్వు నేను లాంటి చిత్రాల‌కు అత‌డు అద్భుత‌మైన యూత్‌ ఫుల్ సాంగ్స్ ని రాశారు. కెరీర్‌ లో 100పైగా పాట‌లు రాసిన చ‌రిత్ర ఆయ‌నిది. గొప్ప లిరిసిస్టుగా టాలీవుడ్‌ లో పేరు తెచ్చుకున్నాడు. అయితేనేం విధి వ‌క్రించింది. ఆ విధి అత‌డి జీవితాన్నే సినిమాగా మార్చేసింది. కెరీర్ పీక్స్‌ లో ఉండ‌గానే చెడు వ్య‌స‌నాలు అత‌డిని అధఃపాతాళానికే తోసేశాయి. ఆరోగ్యం పాడైంది.. మాన‌సిక స‌మస్య‌లొచ్చాయ‌ని ప్ర‌చార‌మైంది. ఒకానొక ద‌శ‌లో చ‌నిపోయే ప‌రిస్థితిలో ఉన్నాడ‌ని, ఆ టైమ్‌ లో తేజ లాంటి వాళ్లు సాయ‌ప‌డ్డార‌ని వార్త‌లొచ్చాయి. ఊహించ‌ని రీతిలో అత‌డి లైఫ్‌ లో వేరొక ట్విస్టు. అత‌డు ఓ పాట‌లో పూజారుల్ని కించ‌ప‌రుస్తూ ప‌ద‌జాలం ఉప‌యోగించాడ‌ని అత‌డిపై పూజారుల సంఘాలు క‌క్ష‌గ‌ట్టాయి. అత‌డిని వెలి వేసాయి.

చివ‌రికి అత‌డు పూజారుల్నే టార్గెట్ చేసి దొంగ‌త‌నాలు చేసేవ‌ర‌కూ తీసుకెళ్లింది స‌న్నివేశం. ఇదంతా వింటుంటే ఓ సినిమా క‌థ‌నే త‌ల‌పిస్తోంది క‌దూ? ఇంత‌కీ ఆ ర‌చ‌యిత ఎవ‌రు? అంటే.. ప్ర‌తిభ‌కు చిరునామా ది గ్రేట్ కుల‌శేఖర్‌(47). ఆ ప్ర‌తిభ ఇప్పుడు జైలు పాలైంది. నా అన్న‌వాళ్లు ఉన్నా వాళ్ల‌కు దూరంగా ఉండాల్సొచ్చింది. విశాఖ‌కు చెందిన అత‌డు చాలా కాలంగా కుటుంబాన్ని వ‌దిలేసి హైద‌రాబాద్ మోతీన‌గ‌ర్‌ లో అద్దెకు ఉంటున్నాడు. తాజాగా అతడు ఓ పూజారికి చెందిన వ‌స్తువులు చోరీ చేసి అరెస్ట‌య్యాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు విచారిస్తున్నారు. 3 రోజుల క్రితం.. ఆర్బీఐ క్వార్టర్స్‌ సమీపంలో ఉన్న మాతా దేవాలయంలోని పూజారి చేతి సంచి చోరీ చేసిన కుల‌శేఖ‌ర్‌ - ఆ త‌ర్వాత‌ శ్రీనగర్‌ కాలనీలోని ఓ ఆలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆదివారం ఆయన్ను అరెస్టు చేశామ‌ని బంజారాహిల్స్ సీఐ రవికుమార్‌ తెలిపారు. రూ.50వేల ఖ‌రీదు ఉండే 10ఫోన్‌ లు - రూ.45వేల విలువ చేసే చేతి సంచులు - క్రెడిట్ -డెబిట్ కార్డులు అత‌డి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

కుల‌శేఖ‌ర్ జీవితం ఓ `ర‌హ‌స్యం` సీరియల్ త‌ర‌హా. 2016లో కాకినాడలోని ఆంజనేయస్వామి దేవాలయంలో శఠగోపం చోరీ చేశాడు. ఆ కేసుకు సంబంధించి రాజమండ్రి జైలులో ఆర్నెళ్లు ఉన్నాడు. ఈ క‌థంతా విన్న త‌ర్వాత ఏమ‌నిపిస్తోంది? `పాట‌`తోనే సాగిన అతడి జీవితంలో పూజారుల రూపంలో శ‌త్రువులు ఎదుర‌య్యారు. అప్ప‌టికే కెరీర్ నాశ‌న‌మైన వ్య‌సనాల‌కు గురై అన్ని రకాలా దిగ‌జారిన అత‌డి ధ్వేషం చివ‌రికి పూజారుల్ని దోచేసేలా చేస్తోంది. అంత‌టి ప్ర‌తిభావంతుడు కేవ‌లం పూజారుల్ని మాత్ర‌మే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అంటే.. బ‌హుశా ఇదో ర‌కం మాన‌సిక రుగ్మ‌త అని అత‌డి స్నేహితులు - స‌న్నిహితులు చెబుతున్నారు. అత‌డి క‌థ సినిమా క‌థ‌ను మించి.. అత‌డి జీవితంలో ఉద్వేగాలు ఉప్పెన‌ను మించి..!