Begin typing your search above and press return to search.
ట్రెండింగ్: మాస్ డైరెక్టర్ ఎక్కడ?
By: Tupaki Desk | 25 Jan 2019 6:06 AM GMTఒక కథని తెరపైకి తీసుకురావాలంటే మారిన ప్రేక్షకుడి అభిరుచితో పాటు హీరో రేంజ్, గత ట్రాక్ రికార్డ్ ని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి. అంచనాను అందుకుంటే ఓకే .. లేదంటే విమర్శకుల దాడికి బలి కావాల్సిందే. ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు బోయపాటి శ్రీను. టాలీవుడ్ లో పక్కా ఊర మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నఆయన పేరు చెబితే ఇప్పుడు స్టార్ హీరోలంతా ఆలోచనలో పడుతున్నారట. కథ చెబుతూనే భయపెట్టడం బోయపాటిది అందెవేసిన చెయ్యి అంటూ సెటైర్లు పడుతున్నాయ్.
తన గురించి తెలియని వాళ్లు ఆయనతో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతుంటే తెలిసిన వాళ్లు మాత్రం బాబోయ్ అంటూ బెంబేలెత్తిపోతున్నారట. ఇదివరకూ ఓ స్టార్ హీరోకి కథ చెప్పినా అట్నుంచి సముఖత వ్యక్తం అవ్వకపోగా.. ఆ కాంపౌండ్ నుంచి తీవ్రమైన తిరస్కారం ఎదురైందని ఇటీవల ప్రచారం సాగింది. `వినయ విధేయ రామ`కు ముందే బోయపాటి పలువురు హీరోలకు కథ వినిపించి రిజెక్ట్ అయ్యాడట. ఇక వీవీఆర్ భారీ డిజాస్టర్ అవ్వడంతో ఈ దర్శకుడు కొన్ని రోజులుగా ఏమయ్యాడు? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
సినిమా విడుదలకు ముందు భారీ డైలాగులు కొట్టిన బోయపాటి రిలీజ్ తరువాత మాత్రం మీడియా అంటే ముఖం చాటేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఎవరికీ కనిపించని బోయపాటి ఈ పరాజయాన్నిజీర్ణించుకోలేకపోతున్నారంటూ మాట్లాడుకుంటున్నారు. ఒక్కో సినిమాకి రూ.11కోట్ల పారితోషికం అందుకునే బోయపాటి ఇలాంటి సినిమా తీస్తాడా? అంటూ సన్నిహిత వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ఇప్పటికైనా మూస నుంచి బయటికి వచ్చి మితిమీరిన హింసాత్మక కథల్ని, మాసిజాన్ని తగ్గించి కొత్తదనం నిండిన కథల్ని ఎంచుకుంటాడని ఆశిస్తోంది ఇండస్ట్రీ. మారిన ట్రెండ్ కి తగ్గట్టు మార్పు కోరతాడా? లేక ఇదే కరెక్ట్ అంటూ మళ్లీ ఊరమాస్ సినిమాలకే ఫిక్స్ అవుతాడా! అంటూ కాస్త ఘాటుగానే చర్చ సాగుతోంది.