Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరీ: టాలీవుడ్ అంటే ఆ ఇద్ద‌రేనా?

By:  Tupaki Desk   |   24 July 2021 12:30 AM GMT
ట్రెండీ స్టోరీ: టాలీవుడ్ అంటే ఆ ఇద్ద‌రేనా?
X
అగ్ర హీరోల చిత్రాల‌కు సంగీత ద‌ర్శ‌కుల‌కుగా రెండే పేర్లు వినిపిస్తున్నాయి. రెగ్యుల‌ర్ గా రిపీటెడ్ గా ప‌నిచేసేది ఇద్ద‌రే ఇద్ద‌రు. ఆ ఇద్ద‌రు థ‌మ‌న్.. దేవి శ్రీ ప్ర‌సాద్. కొన్నేళ్లుగా టాలీవుడ్ టాప్ హీరోలంద‌రికీ సంగీతం స‌మ‌కూరుస్తూ ఆల్ట‌ర్నేట్ లేద‌ని నిరూపించారు. థ‌మ‌న్ క‌న్నా దేవీశ్రీ ప్ర‌సాద్ సీనియ‌ర్. సినిమాల సంఖ్య కూడా ఎక్కువే. థ‌మ‌న్ తో పోలిస్తే ఎక్కువ మంది హీరోల‌తో ప‌నిచేసిన అనుభ‌వం రాక్ స్టార్ సొంతం. చాలామంది అగ్ర హీరోల‌కు దేవిశ్రీనే సంగీతం అదించారు. థ‌మ‌న్ అగ్ర‌ స్థాయి హీరోల‌కు సంగీతం అందించింది త‌క్కువే. ఇలా ఇరువురు ఎవ‌రి సినిమాల‌తో వాళ్లు ఎప్పుడూ బిజీగానే ఉన్నారు. అయితే థ‌మ‌న్ పూర్తి స్థాయిలో రేసులోకి వ‌చ్చిన త‌ర్వాత దేవిశ్రీ ప్ర‌సాద్ కి అవ‌కాశాలు త‌గ్గాయ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది. మ‌రి అప్పటి ప్ర‌చారంలో వాస్త‌వం ఎంతో తెలియ‌దు గానీ తాజాగా ఇరువురి సంగీత ద‌ర్శ‌కుల సినిమాల జాబితాను ప‌రిశీలిస్తే దేవి శ్రీ ప్ర‌సాద్ హీట్ కాస్త త‌గ్గిన‌ట్లే క‌నిపిస్తుంది.

రాక్ స్టార్ చేయాల్సిన వాటిలో చాలా సినిమాల‌కు థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నార‌నే మాట వినిపిస్తోంది. ప్ర‌స్తుతం మ‌హేష్ న‌టిస్తోన్న `స‌ర్కారు వారి పాట‌`కు,... ప‌వ‌న్ క‌ళ్యాణ్-రానా న‌టిస్తున్న అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. న‌ట‌సింహ బాల‌కృష్ణ నటిస్తోన్న `అఖండ‌`కు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమాకు థ‌మ‌న్ ని లాక్ చేసారు. ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌- శంక‌ర్ క‌ల‌యిక‌లో తెర‌కెక్క‌నున్న చెర్రీ 15వ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇలా బిగ్ స్టార్స్ న‌టిస్తున్న క్రేజీ సినిమాల‌న్నింటిని థ‌మ‌న్ ఎగ‌రేసుకుపోవ‌డం విశేషం.

ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ మీడియం రేంజ్ సినిమాల‌కే సంగీతం అందిస్తున్నారు. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్- లింగు స్వామి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం త‌న‌కు ఊర‌ట‌. అలాగే శ‌ర్వానంద్ న‌టిస్తోన్న `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం రాక్ స్టార్ చేతిలో ఉన్న అగ్ర హీరో సినిమా ఒక్కటే. అదే అల్లు అర్జున్ న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఈ సినిమా కోసం దేవి శ్రీ ప్ర‌సాద్ చాలా హార్డ్ వ‌ర్క్ చేసిన‌ట్లు స‌మాచారం. ఏదేమైనా స్థానాలు తారుమారైనా ఇద్ద‌రు బిజీగా ఉన్నారు.

అయితే థ‌మ‌న్ లేక‌పోతే దేవీశ్రీ ఆ ఇద్ద‌రేనా? అస‌లు టాలీవుడ్ మ్యూజిక్ అంటే ఆ ఇద్ద‌రి పేర్లే వినిపిస్తాయా? ఇలా ఇంకెన్నాళ్లు? కొత్త ట్యాలెంట్ ప్రూవ్ చేసుకునే అవ‌కాశ‌మే లేదా? అప్పుడ‌ప్పుడు పార్ట్ టైమ‌ర్స్ లా ఉన్న చాలా మంది త‌మ‌ను తాము మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లే మార్గాన్ని అన్వేషించ‌లేదా? ఇటీవ‌లి కాలంలో నెమ్మ‌దిగా కీర‌వాణి వార‌సుడు యంగ్ డైన‌మిక్ కాలభైర‌వ మాత్రం హ‌ల్ చ‌ల్ చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. అత‌డు ఆ ఇద్ద‌రికీ పోటీ ఇస్తాడేమో చూడాలి. ఆర్పీ ప‌ట్నాయ‌క్ కొన్నాళ్లు ఏలాక ఎందుక‌నో సైలెంట్ అయ్యారు. సాయి కార్తీక్ .. సాగ‌ర్ చంద్ర లాంటి వాళ్లు పార్ట్ టైమ‌ర్లుగానే మిగిలిపోయారు. అటు త‌మిళం నుంచో లేదా హిందీ నుంచో వ‌చ్చేవాళ్లు ఇటీవ‌ల పెరిగారు కానీ లోక‌ల్ ట్యాలెంట్ ఒక వేవ్ లా వ‌చ్చిందేమీ లేదు ఎందుక‌నో! ఎవ‌రు వ‌చ్చినా రెహ‌మాన్ లా ఒక యూత్ ఫుల్ ట్రెండ్ తేవాలి. మ్యూజిక్ అంటే చెవికోసుకునే లా చేయాలి.