Begin typing your search above and press return to search.
పవన్ ను తిడదామా? చిరంజీవినా??
By: Tupaki Desk | 24 Nov 2016 9:00 AM GMTభయంకరమైన పాపులార్టీ రావాలంటే ఏం చేయాలి? మనం చూసినట్లయితే.. చాలామంది యుట్యూబ్ మరియు ఫేస్ బుక్కులో ఎవరో ఒక సెలబ్రిటీనో లేకపోతే ఎవరైనా టాప్ స్టార్ నో తిట్టగానే వెంటనే పాపులర్ అయిపోతారు. ఆ మధ్యన ఒక బి-గ్రేడ్ నటి.. ఒక జబర్ దస్త్ కమెడియన్ పై నానా ఆరోపణలు చేసింది కాని.. ఆమెకు పాపులార్టీ రాలేదు. ఎందుకంటే అవతల ఉన్న జబర్ దస్త్ కమెడియన్ కు అంత క్రేజ్ లేదు కాబట్టి. అదే పవన్ కళ్యాణ్ లేదా మెగాస్టార్ చిరంజీవిని తిడితే? వెంటనే పాపులర్ అయిపోయేది పాప.
ఇప్పుడు ఇవే ఫీట్లను కొన్ని మీడియా సంస్థలు చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ డీమానిటైజేషన్ గురించి ఏం చేయలేకపోతున్నాడని ఒక మీడియా కామెంట్లు చేస్తుంటే.. మెగాస్టార్ చిరంజీవి చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమోలకు అస్సలు పాపులార్టీ రాలేదని ఇంకొందరు చెప్పుకుపోతున్నారు. దాని వలన తమ సంస్థలకు ఎనలేని అటెన్షన్ వస్తుందని వారి ఫీలింగ్. కాని మోడి తీసుకున్న నిర్ణయంపై ఎవ్వరూ ఏమీ చేయలేరు.. వీలైతే కాస్త సాయం తప్ప.. అనేది అందరికీ తెలుసు. అలాగే మాటివి వారే స్వయంగా చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమోలకు ఏ రేంజు పాపులర్టీ వచ్చిందో ఆల్రెడీ చెప్పారు. ఈ సమయంలో మెగా బ్రదర్స్ ను టార్గెట్ చేసి ఈ కామెడీలు ఏంటో అస్సలు అర్ధం కావట్లేదు.
ఇదే టైపులో జూనియర్ ఎన్టీఆర్ ఊరందరి కథలు వింటున్నాడని.. ఎవరు చెప్పినా కథలు వినేస్తున్నాడంటూ కొన్ని రూమర్లు వచ్చేశాయి. నిజానికి ఏ హీరో అయినా కూడా అలా కథలు వింటూనే ఉంటాడు. కాకపోతే జూనియర్ విషయంలో ఆ రేంజు నెగెటివ్ పబ్లిసిటీ ఎందుకో ఎవ్వరికీ అర్ధంకాదు. పైగా రోజుకో డైరక్టర్ పేరు జూనియర్ తో లింక్ చేస్తున్నారు. నిజానికి జూనియర్ వీళ్ల కథకు ఫ్లాట్ అవ్వలేదు అని చెబితే.. అది జూనియర్ కు నెగెటివ్ హైప్ తీసుకురాదు కాని.. సదరు డైరక్టర్లకు దెబ్బేస్తుంది. ఇక సినిమాల మీద ఫోకస్ పెట్టకుండా రకుల్ ప్రీత్ పెళ్ళిళ్లలో డ్యాన్సు వేసుకుని కోట్లు సంపాదిస్తోందని ఒక మీడియా రాసుకొచ్చింది. నిజానికి ఏ హీరో హీరోయిన్లు ఇలాంటి ఫీట్లు చేయట్లేదు? ఏదో రకుల్ ఒక్కత్తే చేసినట్లు. కాకపోతే రకుల్ టాప్ ఫామ్ లో ఉంది కాబట్టి ఆమెను టార్గెట్ చేస్తే ఈజీగా హైప్ వస్తుంది. అవన్నీ చదివి తన తండ్రి చాలా ఫీలయ్యారని రకుల్ అందుకే చెప్పింది మరి.
తిడితేనే పాపులార్టీ వస్తుందని అనుకుంటే.. ఇప్పటికే చాలా చానాళ్ళు చాలా న్యూస్ పేపర్లు చాలా వెబ్సైట్లు.. ఎక్కడికో వెళిపోవాలి. కాని అలా జరగలేదు. కంటెంట్ ను నమ్ముకోండి బాస్.. క్రిటిసిజంను కాదు. ఎందుకంటే ఎంతసేపూ క్రిటిసైజ్ చేసుకుంటూ పోతే చదివే రీడర్లకు కూడా వీళ్ళలో పాజిటిల్ యాంగిల్ అనేదే లేదు బాబోయ్ అంటూ విరక్తి వచ్చేస్తుంది. అది సంగతి.