Begin typing your search above and press return to search.
సెప్టెంబర్ 4న సీఎం జగన్ తో టాలీవుడ్ పెద్దల భేటీ
By: Tupaki Desk | 31 Aug 2021 11:41 AM GMTఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ పెద్దల భేటీ ఎప్పుడు? మెగాస్టార్ చిరంజీవిని పరిశ్రమ సమస్యలు చెప్పాల్సిందిగా మంత్రి పేర్ని నాని ఆహ్వానించి చాలా కాలమే అయ్యింది. అయినా ఇంకా ఈ భేటీ ఎందుకని జరగడం లేదు? అంటూ రకరకాల సందిగ్ధతలు వ్యక్తమయ్యాయి. టిక్కెట్టు ధరల విషయమై దిగి వచ్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా లేకపోవడం వల్లనే ఈ భేటీ వాయిదా పడిందని ఇంతకుముందు ఔత్సాహికులు కొందరు వెల్లడించారు.
కానీ ఇది నిజం కాదు. సీఎం జగన్ రకరకాల వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. అందుకే కొంత ఆలస్యమైంది. ఎట్టకేలకు సెప్టెంబర్ 4న సీఎంతో భేటీకి అట్నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. టాలీవుడ్ కీలక సమావేశానికి తేదీ లాక్ అయ్యింది.. మెగాస్టార్ చిరంజీవితో పాటు కొందరు పెద్దలకు ఆహ్వానం ఉంది. టాలీవుడ్ ప్రముఖులు సెప్టెంబర్ 4 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలవడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలిసింది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి - భారతి రెడ్డి దంపతులు ఇంతకుముందు సిమ్లా-మనాలి విజిట్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రకృతి రమణీయత నడుమ సేద దీరి తిరిగి స్వరాష్ట్రానికి విచ్చేశారు. సిమ్లా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వై.ఎస్.ఆర్ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2 న పులివెందులలో పర్యటించాలని సీఎం నిర్ణయించారు. ఈలోగానే మంత్రి పెర్ని నాని టాలీవుడ్ పెద్దలకు టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది. సీఎంతో చిరు సహా ఇతర పెద్దల భేటీలో ఆయన కీలకంగా సమన్వయం చేస్తున్నారు. వైఎస్ జగన్ ముందు సమర్పించాల్సిన అంశాలపైనా ఇంతకుముందే చిరుతో భేటీలో పేర్ని నాని చర్చించారు. టాలీవుడ్ ముందు ఉన్న అతిపెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల పెంపు అంశం. దానిని పరిష్కరించేందుకు సీఎంతో భేటీలో కీలకంగా చర్చ సాగనుంది.
థియేటర్ల ఆక్యుపెన్సీ వ్వవహారం సహా పన్ను మినహాయింపులు.. థియేటర్ మేనేజ్ మెంట్ కోసం సబ్సిడీలు మొదలైన వాటిని చర్చించనున్నారు. అయితే ఈ భేటీకి కేవలం నలుగురు సినీపెద్దలనే కలవాలని సీఎం కోరినట్టు వచ్చిన వార్తలు నిజమా కాదా? అన్నది వేచి చూడాలి.