Begin typing your search above and press return to search.
గౌట్ అఫీషియల్స్ గా మన వాళ్లు కామెడీ చేస్తున్నారా?
By: Tupaki Desk | 13 Aug 2022 12:30 AM GMTటాలీవుడ్ హీరోలు గౌట్ అఫీషియల్స్ గా పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచిన విషయం తెలిసిందే. అంకుశం, కర్తవ్యం, రౌడీ ఇన్స్ స్పెక్టర్, కలెక్టర్, కలెక్టర్ గారి అబ్బాయి, జైలర్ గారి అబ్బాయి.. ప్రతిధ్వని, పోకిరి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాన్తాడంత లిస్టే వుంది. ఈ సినిమాలు చూసిన పోలీస్ ఆఫీసర్స్ అభినందించిన సందర్భాలు చాలానే వున్నాయి. అయితే ఈ మధ్య పవర్ ఫుల్ పోలీస్ స్టోరీస్ తో వచ్చినా పెద్దగా ప్రేక్షకులు ఆదరించడం లేదు.
దీంతో మన వాళ్లు ఎక్కువగా ప్రభుత్వ అధికారుల పాత్రలని క్రియేట్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అందులో చాలా వరకు ఫ్లాప్ లు అవుతున్నాయో కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అనిపించుకోవడం లేదు. ఎమ్మార్వో, కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ పాత్రల్లో హీరోలని చూపిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. క్యారెక్టర్స్ ఎంత పవర్ ఫుల్ గా వున్నా కథ, కథనాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పవర్ ఫుల్ పాత్రలు కాస్తా కామెడీ అవుతున్నాయి.
కోవిడ్ కారణంగా ఓటీటీల ప్రతినిధ్యం పెరిగిపోవడంతో ప్రేక్షకులు చాలా వరకు వీటికి అడిక్ట్ అయిపోయారు. సినిమా చాలా బాగుంది అన్న టాక్ వస్తే తప్ప ఇల్లు దాటి థియేటర్ల బాట పట్టడం లేదు. ఇదిలా వుంటే మన వాళ్లు పోలీస్ కథలతో పాటు పవర్ ఫుల్ గౌట్ అధికారుల కథలని సిద్ధం చేసి భారీ హంగులతో సినిమాలు చేయడం మొదలు పెట్టారు. అయితే అలా వచ్చిన పలు సినిమాలు ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులుగా నిలుస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఆ మధ్య వచ్చిన `టక్ జగదీష్` మూవీలో నేచురల్ స్టార్ నాని పవర్ ఫుల్ ఎంఆర్వోగా కనిపించాడు. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ థియేటర్లలోకి రాలేకపోయినా డైరెక్ట్ ఓటీటీలో విడుదలై ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఫ్యామిలీ అంశాలని జోడించి నానిని పవర్ ఫుల్ ఆఫీసర్ గా ఆవిష్కరించినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇక రీసెంట్ గా విడుదలైన `ది వారియర్` కూడా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది.
ఇందులో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన విషయం తెలిసిందే. పాత్రని పవర్ ఫుల్ గా మలిచినా కథ, కథనాల విషయంలో దర్శకుడు పట్టుసాధించకపోవడంతో ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఇక రీసెంట్ గా విడుదలైన `రామారావు ఆన్ డ్యూటీ` కూడా ఈ ఫలితాన్ని కూడా అందుకోలేక డిజాస్టర్ గా మిగిలింది. ఇందులో మాస్ మహారాజా రవితేజ డిప్యూటీ కలెక్టర్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. ఈ మూవీ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. పాత్ర మీద పెట్టిన శ్రద్ధ కథ, కథనాలపై దర్శకుడు శరత్ మండవ దృష్టి పెట్టక పోవడంతో ఫలితం తారుమారైంది.
రీసెంట్ గా అంటే ఆగస్టు 12న విడుదలైన లేటెస్ట్ మూవీ `మాచర్ల నియోజక వర్గం`. ఇందులో నితిన్ పవర్ ఫుల్ కలెక్టర్ పాత్రలో నటించాడు. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేక తీవ్ర నిరాశకు గురిచేశాడు. రోటీన్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. రోటీన్ కథకు మాస్ ఎలిమెంట్స్ ని జోడించిన తీరు పెద్దగా ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది.
మన హీరోలు గౌట్ అఫీషియల్స్ గా పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడానికి కారణం దర్శకులు ఎంచుకున్న కథ, ఆ కథలని అర్థవంతంగా నడిపించకపోవడమే. పాత్రలని తీర్చిదిద్దడంలో చూపించిన శ్రద్ధ కథని కొత్తగా ఆవిష్కరించడంలో విఫలం కావడమే. దీంతో మన హీరోలు పోషించిన గౌట్ అఫీషియల్స్ క్యారెక్టర్స్ కామెడీ అయ్యాయి అని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.