Begin typing your search above and press return to search.
ప్చ్.. ఫిలిం సిటి అండ్ ఫారిన్ షూటింగ్..
By: Tupaki Desk | 3 March 2016 10:30 PM GMTపెద్ద సినిమాలు ఎక్కువగా తీస్తేనే ఫిలిం ఇండస్ర్టీ బాగుపడుతుందని అనేవారు కొందరు.. చిన్ని సినిమాలు ఆడితేనే కళామతల్లికి నిజమైన సంతోషం అంటూ ఆవేదన వ్యక్తం చేసే దాసరి నారాయణరావు వంటి వారు మరికొందరు. అసలు వీరందరూ చెప్పేది నిజమేనా? ఒక రెండు ఉదాహరణలు చూద్దాం.
ఇప్పుడు ఒక పెద్ద సినిమా ఉంది. 50 కోట్ల సినిమా. అదేనండీ 50 కోట్లతో తీసే సినిమా. సగం సినిమా ఒక ప్రముఖ ఫిలిం సిటీలో షూట్ చేస్తే.. తక్కిన సినిమాను ఫారిన్ లో తీశారు. ఈ సినిమా రిలీజై 50 కోట్లు వసూలు చేసింది కూడా. ఇప్పుడు ఈ సినిమా వలన ఫిలిం ఇండస్ర్టీకి ఏమైనా ఉపయోగం ఉందా?? ఉండదు. ఫిలిం సిటీలో చేస్తే బయటవారు పెద్దగా ఉపాది పొందరు. ఫారిన్ లో సినిమాను తీస్తే ఇక్కడి వారు పెద్దగా చేసేదేం ఉండదు. ఇకపోతే ఒక చిన్న సినిమా. కంటెంట్ బాగుంది. నిర్మాత స్వయంగా తనే రిలీజ్ చేసుకున్నాడు. 10 కోట్లతో తీసిన సినిమాకు 25 నుండి 40 వచ్చింది. ఈ దెబ్బకి ఇండస్ర్టీ బాగుపడిపోతుందా? తీసిందే తక్కువ బడ్జెట్ తో కాబట్టి ఖచ్చితంగా మేకింగ్ టైములో ఎక్కువమంది ఉపాది పొంది ఉండరు. ఇక లాభాలొస్తే నిర్మాతకే డబ్బులొస్తాయి కాని.. ఇండస్ర్టీకి వచ్చేదేముంది? మాహా అయితే ఆయన ఇంకో రెండు కొత్త సినిమాలు తీస్తాడు.
పెద్ద సినిమాలు ఆడితే ఫిలిం ఇండస్ర్టీకి లాభమా.. లేకపోతే చిన్న సినిమాలు ఆడితేనే ఇండస్ర్టీకి లాభం అంటున్న కొందరు ప్రముఖల మాటలు.. ఇవన్నీ ఎందుకో లాజికల్ గా ఎక్కడా సింక్ అవ్వట్లేదు. అసలు బిజినెస్ చేసుకునేవారికి తప్పిస్తే పక్కన ఎవ్వరికీ ఏం లాభం లేదనే అనిపిస్తోంది. ఏమంటారు గయ్స్?