Begin typing your search above and press return to search.
ఎమ్మిగనూరు వాళ్ళకు ఇదేం పిచ్చో
By: Tupaki Desk | 28 Jan 2016 4:02 AM GMT31 సెంటర్స్.. 175 డేస్.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ''ఇంద్ర''.. అంటూ ఒకప్పుడు మోత మోగిపోయేది. అసలు సినిమా ఎన్ని ధియేటర్లలో 100 రోజులు పడుతుంది.. ఎన్ని సిల్వర్ జూబ్లీ సెంటర్లలో పండగ చేసుకోబోతోంది.. అనేది ఒక రికార్డు. కాని ఇప్పుడు సీన్ మారింది. ఎంత పెద్ద సినిమా అయినా కూడా 30 రోజులకు మించి ఆడే పరిస్థితి ఎక్కడా లేదు. అందుకే కొన్ని సినిమాలకు 25 రోజుల పండగ కూడా చేస్తున్నారు.
కాని ఈ ఎమ్మిగనూరు అనే ఊరు జనాలు ఉన్నారు చూడండి.. వామ్మో వీళ్లకు వీరే సాటి. ఎందుకంటే చాలా సినిమాలను వీరు పోటీ పడి మరీ వందల వందల రోజులు ఆడించేస్తున్నారు. ఆ మధ్యన బాలయ్య ''లెజెండ్'' సినిమాను ఎమ్మిగనూరులో ఓ ధియేటర్ లో ఏకంగా 400 రోజులు వేయించారు. వార్నాయనో ఇది పీక్స్ అనుకున్నారంతా. ఇక బాలయ్య ఫ్యాన్స్ ఇలా ఉంటే.. మెగా ఫ్యాన్స్ ఇంకాస్త రెచ్చిపోయి.. ఫ్లాపైన ''బ్రూస్ లీ'' సినిమాను కూడా 100 రోజలు వేయించారు నాయనో. ఇప్పుడేమో మహేష్ బాబు ''శ్రీమంతుడు'' కూడా ఎమ్మగనూరులో 175 రోజులు పూర్తి చేసుకుంటోంది. అసలు ఈ ఊరి సినిమా లవర్స్ కు ఇదేం పిచ్చో మరి.
పాపం ఆ ఊరి జనాల పరస్థితిని మనం అర్ధంచేసుకోవచ్చు. ఉళ్ళో ఉన్న ధియేటర్లలో ఇలా ఒక్కో సినిమా 175, 400 రోజులు ఆడుతుంటే.. వాళ్లకు కొత్త సినిమాలు చూడటానికి స్కోప్ దొరుకుతుందా అసలు? అసలు ఒక ప్రక్కన సినిమాలు 50 రోజులు కూడా ఆడలేక సతమతమవుతుంటే.. ఈ రికార్డుల పాకులాట ఏంది బాసూ.. పిచ్చ టూ మచ్ కాకపోతే!!