Begin typing your search above and press return to search.

త‌గ్గేదేలే.. ఉస్తాద్ రామ్ బ‌డ్జెట్ అంత పెంచేశాడా?

By:  Tupaki Desk   |   12 May 2022 2:30 AM GMT
త‌గ్గేదేలే.. ఉస్తాద్ రామ్ బ‌డ్జెట్ అంత పెంచేశాడా?
X
టాలీవుడ్ లో స్టార్ హీరోల ఇటీవ‌ల వ‌రుస‌గా పాన్ ఇండియా స్థాయిలో మ‌న చిత్రాలు రికార్డులు సృష్టిస్టూ కాసుల వ‌ర్షం కురిపిస్తున్న నేప‌థ్యంలో బ‌డ్జెట్ ప‌రిమితుల్ని పెంచేస్తున్నారు. త‌మ క్రేజ్ కి మించి ప్ర‌స్తుత మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని భారీగా బ‌డ్జె ల‌ను పెంచేస్తున్నారు. ఒక్కో స్టార్ హీరో త‌న సినిమా బ‌డ్జెట్ ని ఏకంగా వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల‌కు మించి పెంచేశారు. పెంచేస్తున్నారు కూడా. మ‌న సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఏర్ప‌డిన నేప‌థ్యంలో ప్ర‌తీ స్టార్ హీరో బ‌డ్జెట్ ప‌రంగా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటూ పాన్ ఇండియా రేంజ్ లో త‌మ సినిమాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు.

వ‌సూళ్లు కూడా అదే స్థాయిలో వ‌స్తుండ‌టంతో ప్రొడ్యూస‌ర్స్ కూడా భారీగానే ఖ‌ర్చు చేస్తూ స్టార్ హీరోల సినిమాల‌కు భారీ స్థాయిలో బిజినెస్ అయ్యేలా చూస్తున్నారు. ఇది ఇప్ప‌డు ద్వితీయ శ్రేణి స్టార్ ల చిత్రాల‌కు కూడా పాకింది. 20 కోట్ల బ‌డ్జెట్ సినిమాల్లో న‌టిస్తున్న హీరోలు ఇప్ప‌డు త‌మ సినిమా బ‌డ్జెట్ ల‌ని అమాంతం హైకి పెంచేస్తున్నారు. దాదాపు స్టార్ హీరోల‌కు ఒక్క అడుగు దూరంలో అన్న‌ట్టుగా త‌మ సినిమాల బ‌డ్జెట్ ల‌ని పెంచేస్తున్నారు.

ఎక్క‌డా స్టార్ ల‌తో త‌గ్గేదిలే అంటున్నారు. నేచుర‌ల్ స్టార్ నాని సినిమాలు 20 కోట్ల వ‌ర‌కు బ‌డ్జెట్ తో మాత్ర‌మే రూపొందేవి. కానీ `శ్యామ్ సింగరాయ్‌`కి కొంత ఎక్కువే ఖ‌ర్చు చేశారు. ఇప్ప‌డు `ద‌స‌రా`కు కేవ‌లం కాల‌నీ సెట్ కే 12 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారంటే రెమ్యున‌రేష‌న్ ల‌తో క‌లిపి ఎంత ఖ‌ర్చు చేస్తున్నారో ఊహించుకోవ‌చ్చు. ఈ చిత్రాన్ని ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేయ‌బోతున్నారు కాబ‌ట్టి 30 కోట్ల‌కు మించి ఖ‌ర్చే చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

ఇక ఇటీవ‌ల వ‌రుణ్ తేజ్ `గ‌ని` మూవీ కోసం ఏకంగా 30 కోట్ల‌కు మించే ఖ‌ర్చే చేయ‌డం తెలిసిందే. ఇప్ప‌డు ఇదే బాట‌లో హీరో రామ్ కూడా త‌న `ది వారియ‌ర్‌` మూవీకి ఏకంగా 75 కోట్లు ఖ‌ర్చు చేయిస్తున్నార‌ట‌. ఎన్. లింగుసామి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ బ‌డ్జెట్ అనుకున్న దానికి మించి అయిన‌ట్టుగా చెబుతున్నారు. రామ్ ప్ర‌తీ సినిమా బ‌డ్జెట్ 20 నుంచి 25 కోట్ల లోపే. అయితే ఎప్పుడైతే `ఇస్మార్ట్ శంక‌ర్‌` 50 కోట్లు క‌లెక్ట్ చేసిందో అప్ప‌టి నుంచి త‌ను కూడా బ‌డ్జెట్ పెంచేశాడు.

అయితే 50 కోట్లు వ‌సూలు చేస్తే ఆ స్థాయిలో బ‌డ్జెట్ వుంటే ఓకే కానీ ఏకంగా 75 కోట్ల‌కు అంటే మూడొంతులు బ‌డ్జెట్ పెంచేయ‌డం ఇప్ప‌డు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. శాటిలైట్ రైట్స్ వ‌స్తాయ‌నుకున్నా బ‌ట్జెట్ రిక‌వ‌రీ అంత అయితే క‌ష్ట‌మే అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. ఇదిలా వుంటే బోయ‌పాటితో రామ్‌ చేస్తున్న సినిమాకు ఏకంగా 100 కోట్లు బ‌డ్జెట్ అని తెలుస్తోంది. మ‌రి దీనిపై ట్రేడ్ వ‌ర్గాలు ఏమంటాయో చూడాలి.