Begin typing your search above and press return to search.

6 నెలలు.. 12 సినిమాలు

By:  Tupaki Desk   |   28 Jun 2016 5:30 PM GMT
6 నెలలు.. 12 సినిమాలు
X
అంగరంగవైభంవంగా ఈ ఏడాది తొలిరోజునుండీ సినిమాలతో మొదలై, సంక్రాంతి సౌరభాలతో, వేసవి వినోదాలతో అప్పుడే ఆరు నెలల కాలాన్ని పూర్తిచేసుకుంది. సినిమా పరిభాషలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. మరి ఈ ప్రథమార్ధంలో ప్రేక్షకులను మెప్పించిన సినిమాల వివరాలు చూద్దామా??

జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా విడుదలైన రామ్ - కీర్తి సురేష్ ల నేను శైలజ సినిమా ఈ ఏడాది మొదటి విజయంగా నమోదయ్యింది. సింపుల్ లవ్ స్టోరీకి మంచి మ్యూజిక్ జతకలవడంతో సినిమా విజయం సాధించింది.

ఇక ఆ తరువాత సంక్రాంతి బరిలోకి విడుదలైన నాన్నకు ప్రేమతో - సోగ్గాడే చిన్నినాయన - ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలు ఏకకాలంలో హ్యాట్ ట్రిక్ లను అందించి బాక్స్ ఆఫీస్ స్టామినాని రుజువుచేశాయి. నాగార్జున నటించిన ఊపిరి విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

ఇక బన్నీ బాబు నటించిన సరైనోడు సినిమా ఈ హాఫ్ లో బిగ్గెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా, అతని కెరీర్ బెస్ట్ గా నిలవడం విశేషం.

ఈ ప్రథమార్ధంలోనే రెండు విజయాలు సాధించిన హీరోగా నాగ్ తో పాటూ నాని రికార్డు సృష్టించాడు. కృష్ణగాడి వీరప్రేమగాధ - జెంటిల్ మెన్ సినిమాలలో తనదైన ముద్రవేసి ప్రేక్షకులను అలరించాడు.

స్మాల్ ఫిలిమ్ గా విడుదలైన 'అ..ఆ' బిగ్ హిట్ అయ్యింది. అంచనాలు లేకుండా విడుదలైన క్షణం అందరినీ ఆశ్చర్యపరిచి విజయం సాధించింది. సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్ కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. ఇక అనువాద సినిమాలలో అనూహ్యంగా బిచ్చగాడు చిత్రం ఘన విజయం సాధించడం ఆశ్చర్యకరం.

ఈ జోరు ఇలానే సెకండ్ హాఫ్ లో కూడా సాగించి ఈ ఇయర్ ని ఘనంగా ముగించాలని కోరుకుందాం.