Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ఇలాంటివి తీసేవాళ్లు లేరా?

By:  Tupaki Desk   |   24 Dec 2015 10:30 PM GMT
టాలీవుడ్ లో ఇలాంటివి తీసేవాళ్లు లేరా?
X
మనకు అవార్డులు రావడం లేదు, మన సినిమాలను ఎవరూ పట్టించుకోవడం లేదు, కనీసం పెద్ద సినిమా ఫంక్షన్లలో ప్రదర్శనకు కూడా నోచుకోవడం లేదు. ఇదీ మనవాళ్లు చాలా సార్లు వినిపించే వాదన. మనకేదో అన్యాయం జరిగిపోతోందని నెత్తీ నోరూ కొట్టుకోవడమే తప్ప.. ఎంతమంది కొత్తగా ఆలోచిస్తారన్నదే అసలు సమస్య.

టాలీవుడ్ సినిమాలు ఎప్పుడూ ఒకే మూసలో ఉంటాయన్న వాదన ఉంది. దీన్ని అపవాదు అని చాలామంది అంటారు కానీ.. ఇదే నిజం. ఈ ఏడాది కొత్త కాన్సెప్ట్ తో ఇతర భాషలను ఆకర్షించేలా తీసిన సినిమా పేర్లు చెప్పమంటే.. బాహుబలి - కంచె అని తప్ప వేరే ఆన్సర్ రాదు. బాహుబలి లాంటివి నూటికో కోటికో ఒక్కటి వస్తాయి. మరి కంచె మూవీ మాదిరిగా.. క్రిష్ లాగా కొత్తగా ఆలోచించడం ఎవరికీ రాదా ఎవరూ మాట్లాడరు.

చెప్పుకోడానికి దేశంలో రెండో అతి పెద్ద సినీ ఇండస్ట్రీ. ఇందులో 95 శాతం సినిమాలు స్పూఫ్ ల పైనే ఆధారపడి ఉంటాయి. ఏదన్నా సినిమా హిట్ అయితే చాలు.. తర్వాత వచ్చే లో మీడియం బడ్జెట్ సినిమాలన్నిటిలోనూ స్పూఫ్ లు తప్పనిసరి. ఇప్పుడు బాహుబలి - శ్రీమంతుడు అందుకే ఉపయోగపడుతున్నాయి. పోనీ.. కమర్షియల్ మూవీ అయినా మెసేజ్ ఇచ్చి సక్సెస్ కొట్టచ్చని... శ్రీమంతుడుతో మహేష్ ప్రూవ్ చేశాడు కదా.. అప్పుడైనా మేకర్స్ ఆలోచనలు మారతాయా అంటే.. మళ్లీ మామూలే.

ఇప్పుడు బాలీవుడ్ లో రియల్ లైఫ్ స్టోరీల సీజన్ బాగా ఊపుమీదుంది. తల్వార్ - నో వన్ కిల్డ్ జెస్సికా చిత్రాలు హిట్ సాధించిన తర్వాత.. ఈ స్పీడ్ బాగా పెరిగింది. ఇప్పుడు ఫినిషింగ్ దశలో ఉన్న రెండు సినిమాలు దేశం మొత్తాన్ని ఆసక్తి కలిగిస్తున్నాయి. అదే అక్షయ్ కుమార్ నటిస్తున్న ఎయిర్ లిఫ్ట్ - రెండోది సోనమ్ కపూర్ చేస్తున్న నీర్జా. 1990ల్లో జరిగిన గల్ఫ్ వార్ లో.. ఇండియన్స్ పడ్డ కష్టాలను బేస్ ఎయిర్ లిఫ్ట్ తెరకెక్కింది. 23 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ తన ప్రాణం పోగొట్టుకుని వందల మంది కాపాడిన కథ 1986లో జరిగింది. ఈ రియల్ స్టోరీలో సోనమ్ చేస్తోంది.

ఇలాంటి ఆలోచనలు మనోళ్లకు రావా అంటే.. తీస్తే జనాలు చూడరనే సమాధానం వస్తుంది. సరిగ్గా తీయాల్సిన రకంగా తీయడం వస్తే.. చూడ్డానికి ఆడియన్స్ ఎప్పుడూ రెడీనే అనే విషయం తెలిసినా.. అప్పుడు మాట దాటేయడమే.. కాస్త కొత్తగా థింక్ చేయండి టాలీవుడ్ మేకర్స్.