Begin typing your search above and press return to search.
మార్చి 18.. తమిళోళ్లకు రాసిచ్చేశారా?
By: Tupaki Desk | 3 March 2016 7:30 PM GMTసంక్రాంతి తర్వాత రెండు వారాల నుంచి.. మార్చి చివరి వారం ముందు వరకు సినిమాలకు అన్ సీజన్. సాధారణంగా ఈ టైంలో పెద్ద సినిమాలు విడుదల కావు. ఐతే చిన్న, మీడియం రేంజి సినిమాలు మాత్రం ఈ టైంలో పెద్ద ఎత్తున విడుదలవుతుంటాయి. ఫిబ్రవరి నెలంతా ఇలాగే బోలెడన్ని సినిమాలొచ్చాయి. మార్చిలో కూడా తొలి వారం మూడు పేరున్న సినిమాలే రిలీజవుతున్నాయి. ఐతే తర్వాతి రెండు వారాల్లో మాత్రం అనుకున్న స్థాయిలో సినిమాలు రేసులో లేవు. 11న నారా రోహిత్ ‘తుంటరి’ మాత్రమే షెడ్యూలై ఉంది. దానికి పోటీగా ఇంకే చెప్పుకోదగ్గ సినిమా లేదు. తర్వాతి వారమైతే ఖాళీగా వదిలేశారు. చివరి వారంలో రన్ - ఊపిరి లాంటి సినిమాలున్నాయనో ఏంటో కానీ.. మార్చి 18న శుక్రవారం చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలేవీ రిలీజయ్యేలా లేవు.
ఇదే మంచి తరుణం అన్నట్లు ఆ రోజు వరుసగా తమిళ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోతున్నాయి. ఆల్రెడీ సూర్య మూవీ ‘మేము’ను ఆ రోజే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఎప్పుడో డిసెంబర్లో విడుదల కావాల్సిన సినిమా. ఇది కాక.. లేటెస్టుగా ఇంకో రెండు సినిమాలు ఆ తేదీ మీద కన్నేశాయి. జనవరిలోనే విడుదల కావాల్సిన విశాల్ మూవీ ‘కథకలి’ అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఆ చిత్రాన్ని 18నే రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజే విడుదల తేదీ ప్రకటించారు. ఇక ఎప్పుడో మూడేళ్ల కిందట రిలీజవ్వాల్సిన శర్వానంద్, నిత్యామీనన్ ల ‘ఏమిటో ఈ మాయ’.. ఇప్పుడు ‘రాజాధిరాజా’గా పేరు మార్చుకుని 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఇది తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన సినిమా. మొత్తానికి మార్చి 18ని తమిళ సినిమాలకే రాసిచ్చేసినట్లున్నారు.