Begin typing your search above and press return to search.
డ్రైరన్ సీజన్ లో ఇన్ని సినిమాలా?
By: Tupaki Desk | 19 Nov 2022 3:30 PM GMTసినిమా ఇండస్ట్రీకి అత్యంత కీలకంగా నిలిచే సీజన్ లు నాలుగు. సంక్రాంతి, సమ్మర్, దసరా, దీపావళి. ఈ నాలుగు సీజన్ లలో సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్ లే అత్యంత కీలకం. ఈ సీజన్ లలో తప్ప మిగతా సమయంలో సినిమాలు రిలీజ్ చేయాలన్నా నిర్మాతలు ఆలోచిస్తుంటారు. కానీ డ్రైరన్ సీజన్ అయినటువంటి పరీక్షల సమయంలో మాత్రం తమ సినిమాలని రిలీజ్ చేయడానికి ఇష్టపడరు. కానీ ఈ సారి మాత్రం డ్రైరన్ లో క్రేజీ సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి.
సంక్రాంతి సీజన్ తరువాత ఫిబ్రవరి టు మార్చి వరకు సినిమాలని రిలీజ్ చేయడానికి ఏ హీరో, నిర్మాత ఇష్టపడరు. కారణం అదే సమయంలో విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. దీంతో యూత్ పైనే అత్యధికంగా ఆధారపడుతున్న ఇండస్ట్రీకి ఈ సమయం డ్రై రన్ గా చెబుతుంటారు. ఇలాంటి సీజన్ లో తమ సినిమాలని రిలీజ్ చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించరు.. అలాంటి సాహసం చేయరు. కానీ ఈ సారి మాత్రం చాలా వరకు క్రేజీ సినిమాలు ఈ సీజన్ లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ పెద్ద సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. పవన్ కల్యాణ్ `భీమ్లానాయక్` కూడా ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. `డీజే టిల్లు` లాంటి సినిమాలు విడుదలయ్యాయి. మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాల రిజల్ట్ లని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనూ రిలీజ్ కాబోతున్నాయి. 2023 ఫిబ్రవరిపై టాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.
సమంత కీలక పాత్రలో గుణశేఖర్ రూపొందిస్తున్న `శాకుంతలం` ఫిబ్రవరిలోనే రాబోతోంది. భారీ పాన్ ఇండియా మూవీగా 3డీ ఫార్మాట్‌తో పాటు ఐమ్యాక్స్ ఫార్మాట్ లోనూ ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే మూవీతో పాటు తమిళ హీరో ధనుష్ నటిస్తున్న తొలి బైలింగ్వల్ మూవీ `సార్` కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీని ఫిబ్రవరి 17న రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలని ముందు డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరికి వాయిదా వేశారు.
ఈ సినిమాలతో పాటు నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న `అమిగోస్`, కిరణ్ అబ్బవరంతో గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న `వినరో భాగ్యము విష్ణు కథ` కూడా ఫిబ్రవరిలోనే రాబోతున్నాయి. ఇక సంక్రాంతి రేసులో అఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ `ఏజెంట్` కూడా దిగబోతోంది. వీటితో పాటు మరిన్ని సినిమాలు కూడా ఫిబ్రవరిలో రిలీజ్ కు ఆసక్తి చూపిస్తున్నాయని చెబుతున్నారు. ఏం జరగనుందో వేచి చూద్దాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.