Begin typing your search above and press return to search.

ఫెస్టివ‌ల్ సీజ‌న్ ‌కి ట‌ఫ్ ఫైట్ త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   25 Sep 2021 7:30 AM GMT
ఫెస్టివ‌ల్ సీజ‌న్ ‌కి ట‌ఫ్ ఫైట్ త‌ప్ప‌దా?
X
ఫెస్టివ‌ల్స్ వ‌స్తున్నాయంటే టాలీవుడ్‌ లో సంద‌డి మొద‌ల‌వుతుంది. ఎందుకంటే ప్ర‌తీ భారీ సినిమా పండ‌గ సీజ‌న్‌ లో విడుద‌లైతే వ‌చ్చే క‌లెక్ష‌న్‌ ల‌లో ఆ కిక్కే వేరు. .అలాంటి కిక్ ‌ని ఎంజాయ్ చేయాల‌ని.. త‌మ సినిమాల‌తో పడ‌గ సీజ‌న్‌ని క్యాష్ చేసుకుని క‌లెక్ష‌న్ ‌ల సునామీని సృష్టించాల‌ని ప్ర‌తీ స్టార్ హీరో.. డైరెక్ట‌ర్‌.. నిర్మాత ఆశ‌గా ఎదురుచూస్తుంటారు. సినిమాల‌కు పంగ‌డ సీజ‌న్ భారీ వ‌సూళ్ల‌ని అందిస్తుండ‌టంతో ప్ర‌తీ ఒక్క‌రి టార్గెట్ ఫెస్టివ‌ల్స్‌ గా మారిపోయింది.

ఈ నేప‌థ్యంలో మ‌న స్టార్స్ ద‌స‌రా, దీపావ‌ళీ, క్రిస్మ‌స్.. సంక్రాంతి ఫెస్టివ‌ల్స్‌ లో త‌మ చిత్రం విడుద‌ల‌య్యేలా అప్పుడే స్లాట్‌ లు బుక్ చేసుకుని డేట్‌లు ఫైన‌ల్ చేసేసుకున్నారు. ఇప్ప‌టికు సంక్రాంతి ఫైట్ డిక్లేర్ అయిపోయింది. భారీ సినిమాల‌తో సంక్రాంతి సీజ‌న్ నిండిపోయింది. ఇక అంద‌రి క‌ను్న ద‌స‌రా .. దీపావ‌ళీ.. క్రిస్మ‌స్ ‌ల‌పై ప‌డింది. ఇంత‌కు ముందు ఒక స్టార్ సినిమా రిలీజ్ అవుతోందంటే మ‌రో స్టార్ ఓ వారం లేదా.. మూడు నాలుగు రోజులు గ్యాప్ వుండేలా త‌మ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేసుకునేవాడు కానీ ఇప్ప‌డు టైమ్ మారింది.. నో కాంప్ర‌మైజ్ ఎవ‌రు బ‌రిలోకి దిగినా మ‌న కూడా ట్రాక్‌ లో వుండాల్సిందే.. పోటీ ఇవ్వాల్సిందే అనే ఆలోచ‌నాధోర‌ణి మొదలైంది.

దీంతో ఫెస్టివెల్స్‌ కి ఫైట్ రస‌వ‌త్త‌రంగా వుండ‌బోతోంది. ఇప్ప‌టికే కొన్నిచిత్రాలు ద‌స‌రా బ‌రికి వార్ డిక్లేర్ చేయ‌గా తాజాగా ఈ పోటీలో తాము కూడా సై అంటూ రాఘ‌వేంద్రార‌వు `పెళ్లి సంద‌డి`.. బాల‌య్య `అఖండ‌` పోటీకి రెడీ అయిపోయాయి. ఇక ఈ ఫెస్టివెల్‌ కి `కొండ పొలం`..మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌..అక్టోబ‌ర్ 8న రిలీజ్ కాబోతున్నాయి. శ‌ర్వా.. సిద్ధార్ధ్ ‌ల `మ‌హా స‌ముద్రం` అక్టోబ‌ర్ 14న రాబోతోంది.

ద‌స‌రా వ‌రుస సినిమాల‌తో ఫుల్ ప్యాక్ కావ‌డంతో మెగాస్టార్‌ తో పాటు చాలా మంది హీరోలు దీపావ‌ళికి రెడీ అయిపోతున్నారు. చ‌ర‌ణ్‌ తో క‌లిసి తొలిసారి న‌టించిన `ఆచార్య‌` దీపావ‌ళికి రాబోతోంది. ఇదే బాట‌లో వ‌రున్ ‌తేజ్ న‌టిస్తున్న `గ‌ని` న‌వంబ‌ర్ 3న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇవే కాకుండా సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీ న‌టిస్తున్న `అన్నాతే` న‌వంబ‌ర్ 4న రిలీజ్ కి సిద్ధంగా వుంది. కోవిడ్ కార‌ణంగా థియేట‌ర్లు ఆల‌స్యంగా రీఓపెన్ కావ‌డంతో తెలుగు పండ‌గ‌ల‌నే కాకుండా క్రిస్మ‌స్ ‌ని కూడా మ‌న వాళ్లు వాడేస్తుండ‌టం గ‌మ‌నార్హం.