Begin typing your search above and press return to search.
కిరాణా కొట్టు వ్యాఖ్యలపై హీరో నాని వివరణ..!
By: Tupaki Desk | 10 Jun 2022 8:41 AM GMTఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలను ఉద్దేశిస్తూ గతంలో టాలీవుడ్ హీరో నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 'శ్యామ్ సింగరాయ్' ప్రెస్ మీట్ లో నాని మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని.. థియేటర్ కౌంటర్ కంటే, పక్కనే ఉన్న కిరాణా షాప్ కౌంటర్ ఎక్కువగా ఉండటం కరెక్ట్ కాదని అన్నారు. దీంతో వైఎస్సార్సీపీ మద్దతుదారుల నుంచి నాని పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
బడ్డీ కొట్టుకు వచ్చిన కలెక్షన్స్ సినిమా వాళ్లకు రాకపోతే. వాళ్లు కూడా బడ్డీ కొట్టులే పెట్టుకుంటారు కదా?' అంటూ నాని పై ఏపీ మంత్రులు ఫైర్ అయ్యారు. ఒకవేళ నిజంగా సినిమా హీరోకో డిస్ట్రిబ్యూటర్ - ఎగ్జిబిటర్ లకు.. బడ్డీ కొట్టుకు వచ్చే రెండు మూడు వేల ఆదాయం రాకపోతే అందరూ సినిమాలు వదిలేసి అవే పెడతారు కదా? అంటూ ఎదురుదాడి చేశారు.
నాని వ్యాఖ్యలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు.. నాని చెప్పిన విషయం వేరు.. అది వెళ్లిన తీరు వేరంటూ దిల్ రాజు లాంటి పలువురు సినీ ప్రముఖులు మద్దతుగా కూడా నిలిచారు. అయినప్పటికీ నాని సినిమాకు ఇబ్బందులు తప్పలేదు. పవన్ కళ్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నాని సపోర్ట్ గా నిలవడం కూడా మరో కారణంగా నిలిచింది.
ఈ నేపథ్యంలోనే 'శ్యామ్ సింగరాయ్' పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిందనే అభిప్రాయాలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ సపోర్టర్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో నానీని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం మనం గమనించవచ్చు. అయితే లేటెస్టుగా 'అంటే సుందరానికీ' ప్రమోషన్స్ లో తన వ్యాఖ్యల గురించి నాని వివరణ ఇచ్చాడు.
సినిమా టికెట్ ధరలు మరీ తక్కువగా ఉన్నాయనే ఉద్దేశ్యంతోనే తాను అలా మాట్లాడానని.. ఇప్పుడు రేట్లు పెంచడం కూడా సమస్యే అని నాని అన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు తాను కిరాణా కొట్టు వాళ్లను కించపరచలేదని.. ఒకప్పుడు హైదరాబాద్ లోని ఇమేజ్ హాస్పిటల్ పక్కన కిరాణా స్టోర్ లో పని చేశానని.. తనకు వాటి గురించి తెలుసని నాని పేర్కొన్నారు.
''నేను చేసిన కామెంట్ చాలా మిస్ లీడ్ అయింది. నేను ఆ సందర్భంలో కరెక్ట్ గానే మాట్లాడినా.. దాన్ని ట్రోల్ చేస్తూ వేరే విధంగా ప్రచారం చేయడం వల్ల దాని మీనింగ్ మారిపోయింది. నేను ఒకటి చెప్తే.. చివరకు మ్యాటర్ మొత్తం మారిపోయేలా చేశారు'' అని నాని తెలిపారు. దీనికి వివరణ ఇచ్చుకోవాల్సి రావడం ఒకరకమైన దరిద్రమని అన్నారు.
''ఒక కిరాణా స్టోర్ లో మెయింటైనెన్స్ కోసం15 వేలు అయితే.. ఆదాయం 25 -30 వేలు వస్తే యజమాని సర్వైవ్ అవుతాడు. అదే జీతాలు - కరెంట్ బిల్లులు - మెయింటనెన్స్ లక్షల్లో ఖర్చయ్యే థియేటర్ కౌంటర్ వద్ద.. కిరాణా కొట్టు కంటే తక్కువగా ఆదాయం వస్తే ఎలా సర్వైవ్ అవుతారు అన్నదే నా పాయింట్. ఇక్కడ ఎవరినీ తక్కువ చేయలేదు. దేనికదే గొప్ప. అదే వాళ్ళకి ఆధారం. ఈ మీనింగ్ ని అర్థం చేసుకోకుండా కామెంట్స్ చేసేవాళ్లకు ఏం చెప్తాం'' అని నాని చెప్పుకొచ్చారు.