Begin typing your search above and press return to search.
పాత సినిమాలు.. రీరిలీజ్ లు.. ఇప్పుడిదే ట్రెండ్!
By: Tupaki Desk | 15 Aug 2022 2:30 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త సినిమాల హడవుడి కంటే.. పాత సినిమాల రీరిలీజ్ ల హడావుడి ఎక్కువైపోయింది. టీవీలు, స్మార్ట్ ఫోన్స్ లేని సమయంలో సూపర్ హిట్ అయిన సినిమాలను రీరిలీజ్ చేసేవారు. సినిమాలే కాలక్షేపం కావడంలో.. అప్పట్లో ప్రేక్షకులు ఎన్ని సార్లు రిలీజ్ చేసినా థియేటర్స్ ముందు బారులు తీరేవారు. కానీ, ఇప్పుడు అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ లోనే ఎంటర్టైన్మెంట్ అంతా దొరుకుతోంది. ఏ సినిమా కావాలన్నా యూట్యూబ్స్, ఓటీటీ యాప్స్ ద్వారా అందుబాటులోకి వస్తున్నాయి.
ఇలాంటి టెక్నాలజీ కాలంలో కూడా పాత సినిమాకు కొత్త హంగులు అద్ది రీరిలీజ్ చేస్తే.. కాసుల వర్షం కురిపించింది. ఇందుకు 'పోకిరి' సినిమానే పెద్ద ఉదాహరణ. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో దాదపు 16 ఏళ్ల క్రితం వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి ఎన్నో రికార్డులను నెలకొల్పింది.
అయితే అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాను మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా 4 కే వెర్షన్ లో రీమాస్టరింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయగా.. విడుదలైన అన్ని చోట్ల కళ్లు చెదిరే వసూళ్లను రాబట్టింది. 'పోకిరి' రీరిలీజ్ ద్వారా నిర్మాతలకు దాదాపు రూ. 3 కోట్ల రేంజ్ లో లాభాలు వచ్చాయి. దీంతో మిగిలిన హీరోల అభిమానులు కూడా ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.
తమ అభిమాన హీరో కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రాలను రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'జల్సా'ను సెకెండ్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. జల్సా 4 కే వెర్షన్ కూడా రెడీ అయ్యింది. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే. ఆ రోజు 'జల్సా'ను రీ రిలీజ్ చేయబోతున్నారు.
అలాగే ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో.. ఆయన అభిమానులు 'ఘరానా మొగుడు' రీరిలీజ్ చేసేందుకు ఏర్పట్లు చేస్తున్నారట. చిరు కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాల్లో 'ఘరానా మొగుడు' ఒకటి. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1992 అంటే దాదాపు ముప్పై ఏళ్ల క్రితం విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఈ మూవీ థియేటర్స్ కి వస్తే ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇక చిరు బర్త్ డే జరిగిన వారం రోజులకు అంటే ఆగస్టు 29న కింగ్ నాగార్జున పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. అయితే ఆ రోజు 'శివ' సినిమాను రీరిలీజ్ చేయాలని అభిమానులు తెగ ముచ్చట పడుతున్నారు. ఇందులో భాగంగానే 'శివ' మూవీని 4 కే వెర్షన్ లో విడుదల చేయమంటూ డైరెక్టర్ వర్మ మరియు నిర్మాతలను సోషల్ మీడియా వేదికగా రిక్వస్ట్ చేస్తున్నారు. మరి ఇందుకు 'శివ' మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.