Begin typing your search above and press return to search.

#టాలీవుడ్ అమెరికా మార్కెట్.. దిగులు వ‌దిలించే తార‌క‌మంత్రం!

By:  Tupaki Desk   |   9 March 2021 11:30 PM GMT
#టాలీవుడ్ అమెరికా మార్కెట్.. దిగులు వ‌దిలించే తార‌క‌మంత్రం!
X
క‌రోనా ముందు - క‌రోనా త‌ర్వాత అన్న చందంగా మారింది ప‌రిస్థితి. క్రైసిస్ స‌మ‌యంలో టాలీవుడ్ పరిస్థితి తెలిసిన‌దే. భ‌విష్య‌త్ ఎలా ఉంటుందోన‌ని అంతా భ‌య‌ప‌డ్డారు. కార్మికుల ఉపాధికి పెద్ద రేంజులో గండి కొట్టిన క్రైసిస్ దెబ్బ‌కు అంతా ఖాళీయే అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ అందుకు పూర్తి రివ‌ర్స్ లో ఉండ‌డం ఉత్సాహం నింపుతోంది.

టాలీవుడ్ లో ఇటీవ‌ల వ‌రుస విజ‌యాలు మార్కెట్ వ‌ర్గాల్లో హుషారు పెంచాయి. 50శాతం ఆక్యుపెన్సీ‌తోనే క్రాక్ బాగా ఆడింది. మంచి లాభాలార్జించింది. ఆ త‌ర్వాత ఉప్పెన ఒక ఊపు ఊపింది. ఈ మూవీని జ‌నం థియేట‌ర్ల‌లో ఆద‌రించి రికార్డుల‌కు సాయ‌మ‌య్యారంటే అర్థం చేసుకోవాలి. ఇదే జోరులో క్ష‌ణం తీరిక లేని షూటింగుల‌తో ప‌రిశ్ర‌మ‌లో కొత్త క‌ళ క‌నిపిస్తోంది.

టాలీవుడ్ కి అన్నిర‌కాలుగా ఇప్పుడు క‌లిసొస్తోంది. కానీ ఒకే ఒక్క లోటు మాత్రం ఇబ్బందిక‌రం. అదే ఓవ‌ర్సీస్ బిజినెస్. ఇప్ప‌టికీ అమెరికాలో స్ట్రెయిన్ (కొత్త క‌రోనా) క‌ల‌క‌లం అలానే ఉండ‌డంతో అక్క‌డ థియేట‌ర్లు తెర‌వ‌లేని ప‌రిస్థితి. దీనివ‌ల్ల అమెరికా బిజినెస్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. సుమారు 10కోట్ల బిజినెస్ పెద్ద హీరోల‌కు అక్క‌డి నుంచే సాధ్య‌మ‌య్యేది. కానీ ఇటీవ‌ల‌ ప‌రిస్థితి అంత బాలేదు. అయితే ఈ న‌ష్టాల్ని పూడ్చుకునేదెలా? అంటే దానికి కూడా ఆల్ట‌ర్నేట్ వెతికారు మ‌నోళ్లు.

ఇరుగు పొరుగు భాష‌ల్లోకి విస్త్ర‌తంగా మ‌న సినిమాల్ని డ‌బ్ చేసి వ‌ద‌ల‌డ‌మే దీనికి విరుగుడు. పైగా హిందీ మార్కెట్లో తెలుగు సినిమా హ‌వా కొన‌సాగుతున్న వేళ మంచి కంటెంట్ తో అక్క‌డ మార్కెట్లోకి వెళ్లాల‌న్న ధోర‌ణి పెరిగింది. దీంతో మ‌న స్టార్లు పొరుగు భాష‌ల్లో బాగా ప‌రిచ‌యం అయిపోవ‌డంతో అక్క‌డా మార్కెట్ పెరుగుతోంది. హిందీ డ‌బ్బింగులు..శాటిలైట్ అంటూ అద‌నంగా బోలెడంత ఆదాయం వ‌స్తోంది. దీంతో అమెరికా దిగులు కూడా మ‌నోళ్ల‌లో త‌గ్గుతోంద‌ట‌. అల్లు అర్జున్ త‌ర్వాత బెల్లంకొండ‌- రామ్ స‌హా అంద‌రు హీరోలకు హిందీ డ‌బ్బింగుల్లో డిమాండ్ నెల‌కొంద‌ని తెలుస్తోంది. క‌రోనా టైమ్ లో మ‌న డ‌బ్బింగుల‌కు హిందీలో మార్కెట్ పెర‌గ‌డం పెద్ద ప్ల‌స్ అవుతోందిట‌. ఇక ప్ర‌భాస్ ఇప్ప‌టికే పాన్ ఇండియా స్టార్. ప‌వ‌న్.. చ‌రణ్.. తార‌క్ ఇలా అంద‌రూ హిందీ మార్కెట్లోనూ అమాంతం గ్రిప్ పెంచుకునే ప‌నిలో ఉన్నార‌ట‌.