Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్‌

By:  Tupaki Desk   |   31 Dec 2021 12:30 AM GMT
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్‌
X
టాలీవుడ్ లో పాన్ ఇండియా స్థాయి హీరోల లిస్ట్ పెరుగుతోందా? అంటే య‌స్.. పెరుగుతోంది అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు బ‌లంగా చెబుతున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే మ‌న హీరోల సినిమాలు వ‌న్ బై వ‌న్ వ‌చ్చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వున్న ఫిల్మ్ పెర్స‌నాలిటీస్ ని, ఫిల్మ్ మేక‌ర్స్ ని ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నాయి. `బాహుబ‌లి`తో టాలీవుడ్ కు కొత్త క‌ళ వ‌చ్చింది. ఆ క‌లే ఇప్పుడు మ‌న హీరోల‌ని పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరుస్తోంది. ప్ర‌భాప్ న‌టించిన `బాహుబ‌లి` త‌రువాత తెలుగు సినిమా మార్కెట్ స్టాయి కూడా పెర‌గ‌డం, బ‌డ్జెట్ లు కూడా పెరిగి భారీ స్థాయిలో బిజినెస్ అవుతుండ‌టంతో మిగ‌తా హీరోలు కూడా భారీ పాన్ ఇండియా చిత్రాల‌కు సై అంటూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు.

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయి హీరోల జాబితాలో ముందు వ‌రుస‌లో నిలిచిన హీరో ప్ర‌భాస్. బాహుబ‌లి, సాహో సినిమాత త‌రువాత త‌న చిత్రాల‌న్నీ పాన్ ఇండియా రేంజ్ లో వుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందు కోసం అదే స్థాయి క‌థ‌లకు ప్రాముఖ్య‌త ఇస్తున్నారు. దీంతో బ‌డ్జెట్ కూడా ఆ స్థాయిలొనే వుండ‌టంతో అత‌ని సినిమాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ప్ర‌భాస్ త‌రువాత ఆ జాబితాలో చేరిన హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.

ఆయ‌న న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేసిన ఈ మూవీని ఫ‌స్ట్ పార్ట్ గా `పుష్ప : ది రైజ్‌` గా రిలీజ్ చేశారు. పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం తొలి రోజే రికార్డు స్థాయిలో ఓపెనింగ్ క‌లెక్ష‌న్ ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌స్తుతం నార్త్ లోనూ స‌త్తా చాటుతూ ఊహించ‌ని స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ ట్రేడ్ పండితుల‌తో పాటు బాలీవుడ్ బిగ్గీస్ నే విస్మ‌యానికి గురిచేస్తోంది. రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతున్న ఈ మూవీ బ‌న్నీని టాలీవుడ్ నుంచి సెకండ్ పాన్ ఇండియా హీరోగా నిల‌బెట్టింది.

ఇక ఆ త‌రువాత స్థానంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిల‌బోతున్నారు. వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో అవ‌త‌కు మించి అన్న‌ట్టుగా దాదాపు 14 భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. 400 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందిన తొలి ద‌క్షిణాది చిత్రంగా రికార్డు సృష్టిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగానూ స‌రికొత్త రికార్డులు న‌మోదు చేసింది. ఈ సినిమాతో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ పాన్ ఇండాయా స్థాయి హీరోలుగా అవ‌త‌రించ‌బోతున్నారు.

వీరి త‌రువాతి స్థానాల్లో నేచుర‌ల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ నిల‌బోతున్నారు. నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్‌`. 50 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుద‌లైంది. నాలుగు భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా ప్ర‌స్తుతం మంచి టాక్ తో ర‌న్న‌వుతూ భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. స‌రికొత్త క‌థ, క‌థ‌నాల‌తో నాలుగు భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమాతో నాని పాన్ ఇండియా స్టార్ల జాబితాలో చేరిపోయారు.

పూరి జ‌గ‌న్నాథ్ రూపొందిస్తున్న తాజా చిత్రం `లైగ‌ర్‌`. ఈ మూవీతో విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని దాదాపు 125 కోట్ల‌తో నిర్మిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో ఈ సినిమా రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. వీళ్ల సంగ‌తి ఇలా వుంటే మ‌న స్టార్ హీరోల్లో ముందు వ‌రుస‌లో వుండే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంత వ‌ర‌కు పాన్ ఇండియా మూవీస్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ప‌వ‌న్ ప్ర‌స్తుతం క్రిష్ రూపొందిస్తున్న `హ‌రి హ‌ర వీర మ‌ల్లు` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీని దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప‌వ‌న్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం నిల‌వ‌బోతోంది. ఇక మ‌హేష్ బాబు పాన్ ఇండియా మూవీని ఇంత వ‌ర‌కు మొద‌లుపెట్ట‌లేదు. త్వ‌ర‌లో రాజ‌మౌళితో మ‌హేష్ ఓ భారీ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇది ఖ‌చ్చితంగా పాన్ ఇండియా మూవీ అవుతుంది. రాజ‌మౌళి డైరెక్ట్ చేయ‌బోతున్నాడు కాబ‌ట్టి ఇది ఖ‌చ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లోనే వుంటుంది. ఈ లెక్క‌న చూస్తే మ‌న టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్స్ కౌంట్ 8కి చేరుకున్న‌ట్టే.