Begin typing your search above and press return to search.
విజయవాడలో సీఎంతో సినీపెద్దల సమావేశం
By: Tupaki Desk | 29 Sep 2021 5:26 AM GMTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుస ఇన్సిడెంట్స్ కల్లోలంగా మారిన సంగతి తెలిసిందే. టిక్కెట్టు రేట్లపై తగ్గేదేలే! అంటూ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భీష్మించుకుని కూచుందని పరిశ్రమలో అసహనం వ్యక్తమవుతోంది. ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం జగన్ ప్రభుత్వంపైనా మంత్రి పేర్ని నానీపైనా పంచ్ లు విసరగా అది ఇప్పుడు రచ్చ రచ్చగా మారింది. టిక్కెట్టు ధరల యుద్ధం వ్యక్తిగత దూషణలకు తావివ్వడాన్ని ఇండస్ట్రీ జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది.
సరిగ్గా మంత్రి పేర్ని నాని .. ఛాంబర్ ప్రతినిధులతో భేటీ నిర్వహించిన అనంతరం పవన్ ఇలా ఒక పబ్లిక్ వేదికపై విమర్శించడంతో అది పరిశ్రమకు ఇబ్బందిగా మారింది. తదుపరి పరిణామాలు తెలిసిందే.
ఇదిలా ఉండగానే మరోసారి సినీపెద్దలు ఏపీ సీఎం జగన్ తో భేటీకి సిద్ధమవుతున్నారని తాజాగా కబురందింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొంతమంది పెద్దలకు ఎపి ప్రభుత్వ ఆహ్వానం అందిందని.. రేపు (30 సెప్టెంబర్) ప్రభుత్వ ప్రతినిధుల తో విజయవాడ లో సమావేశం జరిగే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి. ఓవైపు పవన్ తో యుద్ధం నడుస్తున్నా.. మరోవైపు సినీపెద్దలను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించడం ఆసక్తిగా మారింది. ఇండస్ట్రీపై పాజిటివ్ గానే జగన్ ప్రభుత్వం స్పందిస్తుందని అంతా ఆశగా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ టికెటింగ్ పోర్టల్ సహా టిక్కెట్టు రేట్లపై రేపటి భేటీలో చర్చ సాగనుందని భావిస్తున్నారు. ఈ భేటీలో సినీపెద్దలు ఎవరెవరు ఉంటారు? అన్నదానిపై స్పష్ఠత రావాల్సి ఉంది.
టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వ తీరు మారేనా?
ఏపీలో టికెట్ ధరల సమస్య చాలా కాలంగా కొనసాగుతోంది. వకీల్ సాబ్ రిలీజ్ కి ముందు విడుదలైన ధరల సవరణ జీవో టాలీవుడ్ లో ప్రకంపనాలు సృష్టించింది. టికెట్ ధరల భారీ తగ్గింపు పరిశ్రమ వర్గాల్లో కలకలం రేపింది. ఈ సమస్య కారణంగా అనేక పెద్ద విడుదలలు నిలిచిపోయాయి. దీంతో సమస్య పరిష్కారానికి ఇరువైపులా చొరవ మొదలైంది.
రవాణా శాఖ మంత్రి పెర్ని నానిని తెలుగు సినిమా పరిశ్రమ సమస్యలను విన్నవించే ముఖ్యుడిగా నియమించగా ఆయన ఈ భేటీలు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు భేటీలో ఆది శేషగిరిరావు- సి కళ్యాణ్ - దిల్ రాజు- ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దానయ్య- భరత్ చౌదరి- వైజాగ్ రాజు వంటి పరిశ్రమల పెద్దలు సమావేశానికి హాజరయ్యారు. నిర్మాతలు ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు సమస్యలపై చర్చించారు.
మునుముందు AP లో సినిమా టిక్కెట్లను విక్రయించడానికి సరైన ప్రభుత్వ ఆధారిత పోర్టల్ ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. కాబట్టి ఈ GO ఉనికిలోకి వస్తే పెద్ద ఆన్ లైన్ ప్రైవేట్ పోర్టల్స్ అని పిలవబడేవి ఇకపై AP లో పనిచేయవు. ఇష్టానుసారం దోపిడీ కూడా వీలుపడదు. ఈ సమావేశంలో ఇంకా చాలా చర్చించారు. నాగచైతన్య `లవ్ స్టోరీ` విడుదలవుతున్నందున ఈ నెల 24 నుండి 100శాతం ఆక్యుపెన్సీ రోజువారీ 4 షోలను అనుమతించాలని పరిశ్రమ అధిపతులు కూడా కోరడంతో పెర్ని నాని ఆరోగ్య అధికారులతో మాట్లాడతానని.. వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు చర్చిస్తానని హామీ ఇచ్చారు. CM తో 100 శాతం ఆక్యుపెన్సీ గురించి చర్చిస్తామని అన్నారు.
వకీల్ సాబ్ సమయంలో ఏపీలో టికెట్ రేట్లు భారీగా తగ్గించబడ్డాయని ధరలు పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు నానితో మాట్లాడారు. మంత్రి ఈ సమస్యలను ఓపికగా విన్నారు. టాలీవుడ్ పెద్దలకు వారు త్వరలో సాధ్యమైన పరిష్కారంతో వస్తారని హామీ ఇచ్చారు. ఇక ఇదే సమావేశంలో ప్రభుత్వ ఆన్ లైన్ పోర్టల్ కి ఎవరికీ అభ్యంతరాలు లేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ .. ప్రభుత్వమే టికెటింగ్ పోర్టల్ ని నడుపుకున్నా అభ్యంతరం ఉండదు. కానీ టిక్కెట్టు ధరలు పెంచడం అవసరమని అన్నారు.
ఇకపై పారితోషికాలు ఆన్ లైన్ లోనే..
ఇటీవల సినిమా టిక్కెట్ల అంశంలో రాజకీయ నాయకుడు.. మాజీ పంపిణీదారుడు ముద్రగడ పద్మనాభం ప్రకటన మరో ప్రకంపనం రేపింది. అతను సీఎం జగన్ కు లేఖ రాయడం అనంతరం నిర్మాత కళ్యాణ్ ముద్రగడ ప్రకటనలపై ఫైర్ అవ్వడం తెలిసిందే. దీనిలో సినిమా టిక్కెట్ ల కోసం మాత్రమే కాకుండా నటీనటులు.. సాంకేతిక నిపుణులు.. చిత్ర పరిశ్రమలో పనిచేసే కార్మికుల వేతనం కోసం కూడా ఆన్ లైన్ చెల్లింపు పద్ధతిని అమలు చేయాలని జగన్ ని ముద్రగడ అభ్యర్థించారు. ఒక టీవీ ఛానెల్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చ సందర్భంగా పేర్ని నాని సమక్షంలోనే ముద్రగడపై కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ముందుగా ముద్రగడను సినిమా నిర్మించి ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యల గురించి మాట్లాడమని కోరాడు. తాను సినిమా చేస్తేనే నిర్మాతల బాధను అర్థం చేసుకుంటానని కళ్యాణ్ తెలిపారు. సమస్యను రాజకీయం చేయవద్దని ఆయన ముద్రగడను అభ్యర్థించారు. ముద్రగడ రాజకీయ మైలేజీని కోరుకుంటే అతను ఏవైనా ఇతర సమస్యలను చేపట్టవచ్చని కల్యాణ్ అన్నారు.