Begin typing your search above and press return to search.
దిల్ రాజును దెబ్బకొట్టిన సినిమా
By: Tupaki Desk | 23 May 2022 4:25 AM GMTసినిమా ఇండస్ట్రీలో నిర్మాత అంటే కేవలం డబ్బులు మాత్రమే పెట్టేవారు కాదు. ఒక సినిమాకు ఎంత పెట్టాలి పెట్టిన తర్వాత ఎంతవరకీ పెట్టిన పెట్టుబడికి లాభం వస్తుంది ఒకవేళ నష్టం వస్తే ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి అతి కొద్దిమంది నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.
ఆయనకు కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ నిర్మాత ఎవరు అంటే.. దిల్ రాజు పేరు కూడా గట్టిగానే వినిపిస్తూ ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ ను ఆయన దాదాపు ముందుగానే ఊహించేస్తారు.
ముందుగా దిల్ రాజు ఒక సినిమాను ఆడియన్స్ తరహాలో ఎంజాయ్ చేయడం మొదలు పెడ్తాడు. తనకు కాన్సెప్ట్ నచ్చలేదు అంటే దర్శకులకు మొహం మీదే చెప్పేస్తాడు. దిల్ రాజు ఆలోచనా విధానాన్ని కూడా నేటి తరం దర్శకులు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అయితే సక్సెస్ రేట్ ను ముందే గమనించి దిల్ రాజు తన కెరీర్ లో కొన్ని ఊహించని అపజయాలను కూడా ఎదుర్కొన్నాడు.
ఆయన చాలా బలంగా నమ్మిన సినిమాలు కూడా విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బ కొట్టాయి. అలాంటి సినిమాల్లో శ్రీనివాస కళ్యాణం ఒకటి. నితిన్ రాశి కన్నా జంటగా నటించిన ఈ సినిమాకు శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. శతమానంభవతి సక్సెస్ కావడంతో మళ్లీ అదే తరహాలో మరో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను మెప్పించాలి అని దిల్ రాజు ఆలోచించాడు.
తన సొంత ఐడియా తోనే సతీష్ వేగేశ్న తో కథను డెవలప్ చేయించాడు. సినిమా చూసిన తర్వాత కూడా చాలా నమ్మకంగా ఉన్న దిల్ రాజు విడుదల తర్వాత ఫస్ట్ వీక్ లోనే సినిమా రిజల్ట్ పై క్లారిటీ కి వచ్చాడు. సోమవారంతో సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా డౌన్ కావడంతో అది డిజాస్టర్ అని కూడా ఆయన ముందుగానే ఊహించారు.
ఆ సినిమా జనాలకు ఎందుకు నచ్చలేదు అని అనుకున్న రాజు గారు మళ్ళి ఒక సర్వే కూడా చేయించాడు. అందులో 70 శాతం మంది జనాలు ఆ సినిమాపై పాజిటివ్ స్పందించినట్లు ఆయన తెలుసుకున్నారు. ఏదేమైనా కమర్షియల్ గా ఆ సినిమా చాలా దెబ్బ కొట్టినట్లుగా ఆయన వివరణ ఇచ్చారు.